గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది

ABN , Publish Date - Oct 12 , 2024 | 02:08 AM

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షీ చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ఈ నెల 31 సినిమా...

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షీ చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ఈ నెల 31 సినిమా విడుదలవుతోంది. శుక్రవారం ఈ చిత్ర దర్శకుడు, నిర్మాత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘‘త్వరలోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నాం. సినిమా అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. ఈ మధ్య కాలంలో తెరకెక్కిన గొప్ప చిత్రాలలో ఇది ఒకటిగా నిలుస్తుంది. విజయంపై పూర్తి ధీమాతో ఉన్నాం’’ అని చెప్పారు. ‘‘ఇది 1980-90ల కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కల్పిత కథ. ఇప్పటిదాకా నేను తీసిన సినిమాల్లో ఇది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది. సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది’’ అని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారు.

Updated Date - Oct 12 , 2024 | 02:08 AM