Srikakulam Sherlockholmes: ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టైటిల్ సాంగ్ వదిలిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్

ABN , Publish Date - Jun 21 , 2024 | 10:29 PM

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటిస్తూ.. రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ‘మా ఊరు శ్రీకాకుళం’ టైటిల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Srikakulam Sherlockholmes: ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టైటిల్ సాంగ్ వదిలిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్
Srikakulam Sherlockholmes Movie Still

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటిస్తూ.. రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ (Srikakulam Sherlockholmes). శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా సినిమా ఫస్ట్ సింగిల్ ‘మా ఊరు శ్రీకాకుళం’ (Maa Ooru Srikakulam Lyrical) టైటిల్ సాంగ్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Konidela Nagababu: పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది..!

ఈ పాట విడుదల అనంతరం డైరెక్టర్ హరీష్ శంకర్ (Director Harish Shankar) మాట్లాడుతూ.. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టైటిల్ సాంగ్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా వుంది. టైటిలే చాలా ఫన్నీగా వుంది. మోహన్ నాకు రైటర్‌గా ఉన్నప్పటి నుంచి పరిచయం. చాలా మంచి రైటర్. సాంగ్ చూశాను. మంగ్లీ అద్భుతంగా పాడింది. విజువల్స్ కూడా చాలా బావున్నాయి. వెన్నెల కిషోర్ నుంచి ఒక డిఫరెంట్ సినిమా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. యూనిట్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అని తెలిపారు.


Harish-Shankar.jpg

‘మా ఊరు శ్రీకాకుళం’ పాట విషయానికి వస్తే.. సునీల్ కశ్యప్ ఈ సాంగ్‌ని క్యాచీ అండ్ టచ్చింగ్ నెంబర్‌గా కంపోజ్ చేయగా.. శ్రీకాకుళం గురించి సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మంగ్లీ ఎనర్జిటిక్ వోకల్స్ పాటకు మరింత ఆకర్షణను తీసుకురాగా, విజువల్స్ సూపర్బ్ అనేలా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 21 , 2024 | 10:29 PM