శివకార్తికేయన్‌తో శ్రీలీల
ABN , Publish Date - Dec 16 , 2024 | 04:49 AM
తమిళ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం ఖరారైంది. ‘ఎస్‌కే 25’ వర్కింగ్ టైటిల్. సుధాకొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక...
తమిళ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం ఖరారైంది. ‘ఎస్‌కే 25’ వర్కింగ్ టైటిల్. సుధాకొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. జయం రవి, అథర్వ కీలకపాత్రలు పోషస్తున్నారు. ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘శివకార్తికేయన్ ప్రతిభావంతుడైన నటుడు. ఆయనతో సినిమా చేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా నిర్మిస్తున్నాం’ అని చెప్పారు. జీవీ ప్రకాశ్‌కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్.