నా అనారోగ్య సమస్య విని భయపడ్డా
ABN , Publish Date - Nov 09 , 2024 | 06:20 AM
‘నా అనారోగ్య సమస్య గురించి విని మొదట భయపడ్డా. కానీ దాన్ని ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసం పొందా. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడంతా బాగానే ఉంది’
‘నా అనారోగ్య సమస్య గురించి విని మొదట భయపడ్డా. కానీ దాన్ని ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసం పొందా. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడంతా బాగానే ఉంది’ అని చెప్పారు కన్నడ నటుడు, 60 ఏళ్ల శివ రాజ్‌కుమార్. తను నటించిన ‘భైరతి రంగల్’ చిత్రం ఈ నెల 15న విడుదలవుతున్న సందర్భంగా ఓ భానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో తను అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు శివ రాజ్‌కుమార్ చెప్పారు. అయితే తన అనారోగ్య సమస్య ఏమిటో ఆయన వెల్లడించలేదు కానీ ‘ఇప్పటికి నాలుగు సెషన్స్ ట్రీట్‌మెంట్ పూర్తయింది. అమెరికా వెళ్లి ఆపరేషన్ చేయించుకుంటున్నాను. ఆ తర్వాత నెల రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటా. నా అనారోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు శివ రాజ్‌కుమార్.