Anasuya vs Vijay Deverakonda: అనసూయ, విజయ్ మధ్య జరిగిన వివాదం, సినిమాలో వాడేశారు కదా !

ABN , Publish Date - Jul 24 , 2024 | 11:27 AM

అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య సామాజిక మాధ్యమాల్లో జరిగిన వివాదం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అనసూయ, విజయ్ పేర్లు కలిసేటట్టు వచ్చే డైలాగ్ ని పెట్టి 'సింబా' దర్శకుడు తన సినిమాలో వాడేసుకున్నాడు.

Anasuya Bharadwaj from the film 'Simbaa'

అనసూయకి, విజయ్ దేవరకొండ అభిమానులకి సామాజిక మాధ్యమాల్లో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అది కూడా ఒకసారి కాదు, ఎన్నో సార్లు అనసూయ ఎదో కామెంట్ చెయ్యడం, విజయ్ అభిమానులు ఆమె కామెంట్ కి సమాధానాలు ఇవ్వటం, ఇలా సామజిక మాధ్యమంలో వీరిద్దరి మధ్య ఒక వాగ్యుద్ధమే జరిగింది. బయట కూడా అనసూయని మీడియా వాళ్ళు విజయ్ దేవరకొండ గురించి ప్రశ్నలు సంధించటం కూడా జరిగింది. ఇలా ఈ ఇద్దరి మధ్య చాలాసార్లు వివాదాలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు అదే విజయ్ దేవరకొండ మాటని 'సింబా' సినిమాలో కూడా అనసూయపై వాడేశారు. 'సింబా' ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఇందులో జగపతి బాబు, అనసూయ, గౌతమీ, వశిష్ట సింహ, కబీర్ సింగ్, అనీష్ కురువిల్లా ఇంకా చాలామంది నటీనటులు ఇందులో నటిస్తున్నారు. ఇందులో అనసూయ ఒక మంచి పాత్ర పోషిస్తోంది అని తెలుస్తోంది ట్రైలర్ చూస్తుంటే. 'మందు, దమ్ము కన్నా దుమ్ము వల్లే చాలామంది చనిపోతున్నారు' అనే విషయం జగపతి చెప్పడంతో ఈ సినిమా నేపధ్యం పొల్యూషన్ పై ఉండొచ్చు అని అర్థం అవుతోంది.

anasuyavijaydeverakondaone.jpg

ఎందుకంటే 'సింబా' అని టైటిల్ పెట్టి టాగ్ లైన్ ది ఫారెస్ట్ మాన్ అని పెట్టారు. అంటే మొక్కలు నాటండి, చెట్లు వలన పర్యావరణం మెరుగవుతుంది, దానివలన మనిషి జీవనవిధానం బాగుపడుతుంది అనే కాన్సెప్ట్ ఈ సినిమాలో వుంది కూడా అర్థం అవుతోంది. అయితే అనసూయ తన టూ వీలర్ పై వస్తుంటే ఒకతను బండి తుడవడానికి వచ్చి, 'అక్క నీకు మహేష్ బాబు లాంటి మొగుడొస్తాడు అక్కా' అని అంటాడు, అనసూయ కొంచెం మొహం అదోలా పెట్టుకుంటుంది, వెంటనే అతను 'అక్కా నీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడొస్తాడు అక్కా' అంటాడు. అనసూయ వెంటనే నవ్వు ముఖంతో కనపడుతుంది. ఇలా సినిమాలో విజయ్ దేవరకొండ, అనసూయ రియల్ లైఫ్ లో మధ్యలో నడిచిన వివాదాన్ని రీల్ లైఫ్ లో ఇలా వాడేసుకున్నారు. మురళి మోహన్ ఈ సినిమాకి దర్శకుడు, ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, రాజేందర్ రెడ్డి లు ఈ సినిమాకి నిర్మాతలు.

Updated Date - Jul 24 , 2024 | 11:27 AM