కాశీలో శివశక్తి

ABN , Publish Date - Dec 19 , 2024 | 06:16 AM

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటి స్తున్న చిత్రం ‘తండేల్‌’. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ నెల 22న కాశీలో...

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటి స్తున్న చిత్రం ‘తండేల్‌’. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ నెల 22న కాశీలో ‘తండేల్‌’ చిత్రం నుంచి శివశక్తి పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. జాతర నేపథ్యంలో సాగే గీతమిది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగచైతన్య, సాయిపల్లవి శివ పార్వతుల నాట్య భంగిమలో కనువిందు చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Dec 19 , 2024 | 06:16 AM