షెర్లాక్ హోమ్స్ సందడి
ABN , Publish Date - Dec 01 , 2024 | 06:35 AM
హాస్య నటుడు వెన్నెల కిశోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు...
హాస్య నటుడు వెన్నెల కిశోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం టీజర్‌ను గురువారం విడుదల చేశారు. వంశీ నందిపాటి ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు. సినిమాలో మంచి పాత్ర పోషించినట్లు అనన్య నాగళ్ల చెప్పారు. దర్శకుడు మోహన్ మాట్లాడుతూ ‘వంశీగారు మా సినిమాను తీసుకోవడంతో మాకు చాలా ధైర్యం వచ్చింది. ఫస్ట్ కాపీ చూసి ఆయన చెప్పిన మార్పులు ఫాలో అయ్యాం’ అన్నారు.