Journey: ‘జర్నీ’ రీ రిలీజ్‌కు రెడీ..

ABN , Publish Date - Sep 15 , 2024 | 06:37 PM

శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జర్నీ’. 2011 డిసెంబర్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను రీ రిలీజ్‌కు తెస్తున్నారు. ‘జర్నీ’ రీ రిలీజ్ ఎప్పుడంటే..

Journey Movie Poster

శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జర్నీ’ (Journey). 2011 డిసెంబర్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. తమిళ్ డబ్బింగ్ మూవీగా తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ‘జర్నీ’ పాటలు అప్పటి కుర్రకారుని కట్టి పడేశాయి. రెండు ప్రేమ కథలు సమాంతరంగా చూపించిన తీరు అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా.. ఎమోషనల్‌కి గురి చేసింది. అప్పటి ఈ మ్యాజికల్ లవ్ స్టోరీని లక్ష్మీ నరసింహ మూవీస్ ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకొస్తోంది. (Journey Re Release Update)

Also Read- Manchu Family: మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది..


ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఏ విధంగా ఉందో తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 21న ఈ ‘జర్నీ’ మూవీని రీ రిలీజ్ చేసేందుకు లక్ష్మీ నరసింహ మూవీస్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో రీ రిలీజ్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. దాదాపు 13 ఏళ్ల తరువాత మళ్లీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుప్రియ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సినిమా రీ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.

Also Read- Thalapathy69: దళపతి విజయ్ చివరి చిత్ర ప్రకటన వచ్చేసింది..


Journey-Movie.jpg

హార్ట్ టచ్చింగ్ ఎమోషనల్ మూవీగా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను సైతం అలరించి.. భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. మరి ఇప్పుడీ సినిమా ఇప్పటి ఆడియెన్స్‌ని ఎలా ఆకట్టుకుంటుందో.. అప్పటి ఆడియెన్స్‌కు ఎంతలా నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తుందో చూడాలి. ఆల్రెడీ బుకింగ్స్ జోరందుకున్నాయని బుక్ మై షో ట్రెండ్ చూస్తే తెలుస్తోంది.

Also Read- Jr NTR: ‘దేవర’ చూసే వరకు బ్రతికించమన్న అభిమాని కోసం ఎన్టీఆర్ ఏం చేశారంటే..

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?

Read Latest Cinema News

Updated Date - Sep 15 , 2024 | 06:37 PM