సంపత్ నందితో శర్వా
ABN , Publish Date - Sep 20 , 2024 | 12:40 AM
శర్వానంద్ కథానాయకుడిగా కొత్త చిత్రం ఖరారైంది. ‘శర్వా 38’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు...
శర్వానంద్ కథానాయకుడిగా కొత్త చిత్రం ఖరారైంది. ‘శర్వా 38’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కె.కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ గురువారం మేకర్స్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. శర్వా మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నారని యూనిట్ తెలిపింది. సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్