శకుంతలక్కయ్య వచ్చింది!

ABN , Publish Date - Dec 11 , 2024 | 06:00 AM

వెన్నెల కిశోర్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌ జోరు పెంచారు. ఇటీవల...

వెన్నెల కిశోర్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌ జోరు పెంచారు. ఇటీవల టీజర్‌ విడుదల చేయగా, తాజాగా స్నేహా గుప్తా పాల్గొన్న ‘శకుంతలక్కయ్య’ పాటను రిలీజ్‌ చేశారు. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను ఉమా నేహా పాడారు. సునీల్‌ కాశ్యప్‌ స్వర పరిచారు, రైటర్‌ మోహన్‌ దర్శకత్వంలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, సీయా గౌతమ్‌ కథానాయికలు. ‘క’, ‘పొలిమేర 2’, ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాలతో విజయం సాధించిన వంశీ నందిపాటి ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Updated Date - Dec 11 , 2024 | 06:00 AM