సీరియల్‌ కిల్లర్‌ కాన్సెప్ట్‌

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:56 AM

‘సీరియల్‌ కిల్లర్‌ కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది. కంటెంట్‌ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇటువంటి చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న దర్శకనిర్మాత వడ్లపట్ల మోహన్‌ను అభినందిస్తున్నా’ అని అన్నారు...

‘సీరియల్‌ కిల్లర్‌ కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది. కంటెంట్‌ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇటువంటి చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న దర్శకనిర్మాత వడ్లపట్ల మోహన్‌ను అభినందిస్తున్నా’ అని అన్నారు. ఇండియన్‌ మోషన్‌ పిక్చర్స్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌(ఐఎంపీఏ) వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌. దర్శకనిర్మాత వడ్లపట్ల మోహన్‌ తెరకెక్కించిన ‘ఎంఫోర్‌ఎం’ చిత్రం హిందీ ట్రైలర్‌ను గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోని ఇఫ్ఫి కళా అకాడమీ వేదికపై అతుల్‌ రిలీజ్‌ చేశారు. చిత్ర హీరోయిన్‌ జో శర్మ మాట్లాడుతూ ‘సీరియల్‌ కిల్లర్‌ కాన్సెప్ట్‌ కొత్తగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది’ అని అన్నారు. దర్శక నిర్మాత వడ్లపట్ల మోహన్‌ మాట్లాడుతూ ‘మోటివ్‌ ఫర్‌ మర్డర్‌ తెలిసినప్పుడు మైండ్‌ బ్లో అవుతుంది. అనూహ్యమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నాను. త్వరలో ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం’ అని అన్నారు.

Updated Date - Nov 26 , 2024 | 03:56 AM