సీనియర్ సినీ నిర్మాత సూర్యనారాయణబాబు కన్నుమూత
ABN , Publish Date - Jul 30 , 2024 | 04:24 AM
సీనియర్ నిర్మాత, మహేశ్‌బాబు మేనమామ ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కన్ను మూశారు. సూపర్‌స్టార్ కృష్ణకు బావ...
సీనియర్ నిర్మాత, మహేశ్‌బాబు మేనమామ ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కన్ను మూశారు. సూపర్‌స్టార్ కృష్ణకు బావ అయిన సూర్యనారాయణ బాబు ‘మనుషులు చేసిన దొంగలు’, రామ్ రాబర్ట్ రహీమ్’, ‘సంధ్య’, ‘బెజవాడ రౌడీ’ తదితర చిత్రాలు నిర్మించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుడివాడ నియోజక వర్గం నుంచి ఎన్టీఆర్ పై పోటీ చేసి ఓడిపోయారు. నటుడు విజయ్‌చందర్‌తో కలిసి ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ‘కలియుగ విశ్వామిత్ర’ చిత్రాన్ని కూడా నిర్మించారు. సూర్యనారాయణ బాబు పార్ధీవ దేహాన్ని మంగళవారు ఉదయం కోకాపేటలోని మూవీ టవర్స్‌లో ఉంచి, ఆ తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు.