రాజకీయాల్లోకి సాయాజీ షిండే

ABN , Publish Date - Oct 12 , 2024 | 02:16 AM

వెండితెరపై విలన్‌, కమెడియన్‌ పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మరాఠా నటుడు సాయాజీషిండే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శుక్రవారం ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్‌ నేతృత్వంలోని...

వెండితెరపై విలన్‌, కమెడియన్‌ పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మరాఠా నటుడు సాయాజీషిండే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శుక్రవారం ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ)లో చేరారు. అజిత్‌పవార్‌ స్వయంగా కండువా కప్పి సాయాజీ షిండేను పార్టీలోకి ఆహ్వానించారు. అజిత్‌పవార్‌ పనితీరు నచ్చి ఎన్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు షిండే తెలిపారు. త్వరలో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ తరపున ప్రచారం చేయడంతో పాటు సాయాజీ షిండే ఎమ్మెల్యేగా బరిలో నిలవనున్నారని సమాచారం.

Updated Date - Oct 12 , 2024 | 02:16 AM