థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నచ్చేలా సత్యభామ
ABN , Publish Date - Jun 04 , 2024 | 12:29 AM
థ్రిల్లర్ చిత్రాల స్పెషలిష్ట్‌గా పేరు తెచ్చుకున్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. సినిమాకు ఆయన ఇచ్చిన సంగీతం కంటే అందులోని నేపథ్య సంగీతంతోనే...

థ్రిల్లర్ చిత్రాల స్పెషలిష్ట్‌గా పేరు తెచ్చుకున్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. సినిమాకు ఆయన ఇచ్చిన సంగీతం కంటే అందులోని నేపథ్య సంగీతంతోనే పాపులరైన శ్రీచరణ్.. తాజాగా మ్యూజిక్ అందించిన చిత్రం ‘సత్యభామ’. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించగా.. నవీన్‌చంద్ర కీలక పాత్ర పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. ఈ నెల 7న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను మీడియాతో ముచ్చటించారు.
‘‘నేను కేవలం థ్రిల్లర్ మూవీస్‌కే ఎక్కువ వర్క్ చేస్తానని అందరూ అభిప్రాయపడుతుంటారు. కానీ నాకు అన్ని రకాల సినిమాలకు సంగీతం అందించడం ఇష్టం. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలుంటాయి. అవి వేటికవే భిన్నంగా ఉంటూ.. అందరినీ ఆకట్టుకుంటాయి. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ చిత్రం చాలా బాగా నచ్చుతుంది. ఇందులోని ట్విస్ట్‌లు అదిరిపోతాయి. ఒక పోలీసాఫీసర్ ఎమోషనల్ జర్నీ ఇది. కాజల్‌కు ఇది పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ సినిమా అవుతుంది. ఇందులోని యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్స్‌లో సినిమాను చూసే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. పోరాట ఘట్టాల్లో ఆమె డూప్ లేకుండా చేశారు. కాజల్ కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. డైరెక్టర్ సుమన్ ఈ సినిమాను తన మేకింగ్‌తో మరో స్థాయికి తీసుకెళ్లారు’’ అని చెప్పారు.