నిర్మాతగా సంతృప్తినిచ్చింది

ABN , Publish Date - Aug 09 , 2024 | 12:42 AM

‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిహారిక కొణిదెల నిర్మాతగా మారారు. యదు వంశీ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిహారిక మీడియాతో ముచ్చటించారు...

‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిహారిక కొణిదెల నిర్మాతగా మారారు. యదు వంశీ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిహారిక మీడియాతో ముచ్చటించారు. ‘‘కథ విన్న వెంటనే ఈ సినిమాలో భాగం అవ్వాలనుకున్నాను. ఒక ఊరిలో జాతర నేపధ్యంలో మూడు తరాలకు చెందిన కథగా దర్శకుడు తెరకెక్కించారు. అందరికీ సినిమా విపరీతంగా నచ్చుతుంది. ఇందులో ఎన్నో క్యారెక్టర్లు ఉన్నా.. ప్రతీ పాత్రకూ విలువ ఉంటుంది. ప్రేక్షకులు ఏదో ఒక పాత్రతో కచ్చితంగా ట్రావెల్‌ అవుతారు. ఒక నిర్మాతగా ఈ సినిమా నాకెంతో సంతృప్తినిచ్చింది’’ అని చెప్పారు.

Updated Date - Aug 09 , 2024 | 12:42 AM