సారంగపాణి జాతకం
ABN , Publish Date - Aug 26 , 2024 | 06:02 AM
ప్రియదర్శి హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. జాతకాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్‌ను...
ప్రియదర్శి హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. జాతకాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్‌ను ఖాయం చేసి, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. జంధ్యాల గారి తరహా వినోదాన్ని పంచే చిత్రమిదని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు. కుటుంబంతో హాయిగా చూడగలిగే హాస్య సంబరం ఈ సినిమా అని మోహనకృష్ణ చెప్పారు. ఈ చిత్రంలో రూప కొడువాయుర్ కథానాయిక. సంగీతం: వివేక్ సాగర్.