Sankranthiki Vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ వచ్చేసింది

ABN , Publish Date - Dec 30 , 2024 | 07:20 PM

విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ నుండి మూడో సాంగ్ ఫెస్టివల్ బ్యాంగర్ వచ్చేసింది. వెంకీ కోరి మరీ పాడిన ఈ పాట ముందుగానే సంక్రాంతి వైబ్‌ని తెచ్చేసింది. కలర్ ఫుల్ సెట్స్‌లో, ఊర మాస్ స్టెప్స్‌లో వచ్చిన ఈ పాట ఎలా ఉందంటే..

Sankranthiki Vasthunnam Movie Song Still

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో రాబోతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ మూవీ నుండి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్ కావడంతో థర్డ్ సింగిల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాన్సెప్ట్ వీడియో, ప్రోమో థర్డ్ సింగిల్ కోసం చాలా క్యురియాసిటీని క్రియేట్ చేయగా.. ఫైనల్‌గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫెస్టివ్ బ్యాంగర్ థర్డ్ సింగిల్ ‘బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్’ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Kannappa Heroine: ‘కన్నప్ప’ హీరోయిన్.. కత్తిలా ఉంది


భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పొంగల్ స్ఫూర్తిని క్యాప్చర్ చేయగా.. వెంకటేష్, మైపిలో రోహిణి సోరట్, భీమ్స్ సిసిరోలియో ఎనర్జిటిక్ వోకల్స్‌తో అదరగొట్టారు. భీమ్స్ DJ అవతార్‌ ఆలాపనతో ఈ పాట ప్రారంభమైంది. జనవరి చలి వాతావరణం, రంగోలీల వంటి సంక్రాంతికి ముందు జరిగే ఉత్సవాలతో పాటను మొదలుపెట్టగా.. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఫ్రేమ్‌లోకి అడుగుపెట్టడంతో సాంగ్ దద్దరిల్లిపోయింది. ఈ పాట రూరల్ పొంగల్ వేడుకలను అందంగా ప్రజెంట్ చేసింది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పండగ ప్రాముఖ్యతను, ఐక్యత, వేడుకలను అద్భుతంగా వర్ణించింది.


Venkatesh.jpg

వెంకటేష్ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ ట్రాక్‌కి ఎనర్జిటిక్ టచ్‌ని యాడ్ చేసింది, వెంకటేష్, భీమ్స్ సిసిరోలియో, మయిపిలో రోహిణి సోరట్‌లు తమ డైనమిక్ వోకల్స్‌తో ఆకట్టుకోగా.. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతమైన పండుగ మూడ్‌ క్యారీ చేసింది. వెంకటేష్, ఇద్దరు హీరోయిన్స్ సాంప్రదాయ వస్త్రధారణలో ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టారు. గ్రామీణ సంస్కృతిని వర్ణించే గ్రాండ్ సెట్, సాంగ్‌కి కలర్ ఫుల్ వైబ్‌ని యాడ్ చేసింది, పొంగల్ ఉత్సవాల్లో ఆడియన్స్‌ని ముంచెత్తుతుంది. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌తో కూడిన ఈ ట్రాక్ పర్ఫెక్ట్ పొగల్ సాంగ్‌గా సీజన్‌కు సరైన టోన్‌ను సెట్ చేస్తుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది.


Venkatesh-2.jpg

Aslo Read-Game Changer: డిప్యూటీ సీఎం డేట్ ఇస్తే.. హిస్టరీ రిపీట్ అవుద్ది..

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..

Also Read-Devi Sri Prasad: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' వెనుక ఏం జరిగిందంటే..

Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 30 , 2024 | 07:20 PM