Spirit: ప్రభాస్ కోసం సందీప్ 'మెగా' ప్లాన్

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:18 PM

ప్రస్తుతం యానిమల్ సినిమా సీక్వెల్ యానిమల్ పార్క్, ప్రభాస్(Prabhas) అప్‌కమింగ్ ప్రాజెక్ట్ స్పిరిట్‌(Spirit)పై ఫోకస్ చేస్తున్నాడు డైరెక్టర్ సందీప్. అలాగే ప్రభాస్ కోసం ఏకంగా ఈ సారి పెద్ద 'మెగా' ప్లాన్ వేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే..

sandeep reddy with ranbir

సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga).. ఈ పేరు చెబితే చాలు బాక్సాఫీస్‌తో పాటు కొందరు క్రిటిక్స్ కూడా షేక్ అయిపోతుంటారు. గతేడాది 'యానిమల్' సినిమాతో ఆయన క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం యానిమాలే కాదు కెరీర్ ఆరంభం నుంచి అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో ఆయన బోల్డ్ అండ్ రా(Bold &Raw) మూవీస్‌తో కొత్త ఒరవడిని సృష్టించారు. ఈ డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్‌తో పనిచేయడానికి కేవలం టాలీవుడ్ ఏ కాదు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా క్యూలో నిల్చుంటున్నారు. అయితే ఈయన మాత్రం నెక్స్ట్ యానిమల్ సినిమా సీక్వెల్ యానిమల్ పార్క్, ప్రభాస్(Prabhas) అప్‌కమింగ్ ప్రాజెక్ట్ స్పిరిట్‌(Spirit)పై ఫోకస్ చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ కోసం ఏకంగా ఈ సారి పెద్ద 'మెగా' ప్లాన్ వేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే..


తీసిన మూడు సినిమాలతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సందీప్.. ప్రభాస్‌తో చేయబోయే సినిమాకి ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో అని సినీ వర్గాల్లో ఉత్కంఠ మొదలైంది. యానిమల్ సినిమాలో బాలీవుడ్ యాక్టర్లని పిండేసిన వంగా.. ప్రభాస్ స్పిరిట్ కోసం మరోసారి మ్యాడ్ కాస్ట్‌తో బరిలోకి దిగాలని చూస్తున్నాడు. దీనికోసం ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan) ని క్యాస్ట్ చేయాలనీ చూస్తున్నాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఎలాంటి రోల్‌నైనా అవలీలగా చేస్తూ దేశంలోనే నటనకు సర్కార్‌గా మారారు. దీంతో బిగ్ బీని సందీప్ ఎలా వాడుకుంటాడో అనే చర్చ మొదలైంది. ప్రభాస్ ఎలాగో బాహుబలితో నార్త్‌లోను కల్ట్ ఫాలోయింగ్ సాధించాడు. ఈ నేపథ్యంలో అమితాబ్‌ని సందీప్ ఏ షేడ్స్‌లో చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటీ మొదలైంది. ఈ ఇద్దరి కాంబో సెట్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ ఇప్పటివరకు కనివిని ఎరగని రికార్డులు సృష్టించబడతాయి.


ఇప్పటికే ‘ఆదిపురుష్, దేవర’ వంటి పాన్ ఇండియా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకీ పరిచయమైన సైఫ్ అలీ ఖాన్, అతని భార్య కరీనా కపూర్‌లని ఈ సినిమాలో విలన్లుగా చూపించేందుకు సందీప్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రావణ్, భైర రోల్స్‌తో తెలుగు ఫ్యాన్స్ సరిగ్గా సాటిస్పై కాలేదని సందీప్ మార్క్ పడితే గాని సైఫ్ యాక్టింగ్ రేంజ్ ఏంటో తెలుగు ఆడియెన్స్‌కి తెలిసి వస్తోందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ వార్తలపై అఫిషియల్‌గా ఎవరు స్పందించలేదు.

Updated Date - Oct 07 , 2024 | 03:18 PM