సమంత సమాధానం?
ABN , Publish Date - Aug 16 , 2024 | 12:26 AM
సమంత ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సెల్ఫీ చర్చనీయాంశమైంది. ఇది నాగచైతన్య నిశ్చితార్థం తర్వాత ఆమె పోస్ట్ చేసిన తొలి ఫొటో కావడమే అందుకు కారణం...
సమంత ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సెల్ఫీ చర్చనీయాంశమైంది. ఇది నాగచైతన్య నిశ్చితార్థం తర్వాత ఆమె పోస్ట్ చేసిన తొలి ఫొటో కావడమే అందుకు కారణం. ఇందులో సమంత స్టైలిష్‌గా కనిపించారు. ఈ స్టిల్‌లో సమంత ఎడమ కణతపై మధ్యవేలును ఉంచారు. దర్శకుడు రాజ్ నిడమోరుతో డేటింగ్‌లో ఉన్నారంటూ తనపై వస్తున్న పుకార్లను పట్టించుకోబోనని శామ్ చెప్పకనే చెప్పారని కొందరు నెటిజన్లు అంటున్నారు. ‘ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్’ అని రాసున్న టీషర్ట్‌ను సమంత ధరించారు. దీంతో ఈ కొటేషన్ ద్వారా కొందరికి సమంత సరైన సమాధానం చెప్పారని మరో అభిమాని వ్యాఖ్యానించారు.