సమంతకు గాయం

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:20 AM

టాలీవుడ్‌ కథానాయిక సమంత గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె బుధవారం సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ఎప్పుడు, ఎలా గాయపడ్డారు అనే వివరాలను ఆమె వెల్లడించలేదు. మోకాలి గాయానికి...

టాలీవుడ్‌ కథానాయిక సమంత గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె బుధవారం సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ఎప్పుడు, ఎలా గాయపడ్డారు అనే వివరాలను ఆమె వెల్లడించలేదు. మోకాలి గాయానికి ఆక్యుపంచర్‌ విధానంలో చికిత్స తీసుకుంటున్నారు సమంత. తన శరీరంలో రెండు సూదులు గుచ్చి ఉన్న ఫొటోను ఆమె షేర్‌ చేసి, ‘గాయాల బారిన పడకుండా యాక్షన్‌ స్టార్‌ను అవ్వగలనా?’ అని సరదాగా స్పందించారు. దీంతో సమంత లీడ్‌రోల్‌లో నటిస్తూ, నిర్మిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రం షూటింగ్‌లో గాయపడ్డారని భావిస్తున్నారు. ఆమె నటించిన ‘హనీ బన్నీ’ వె బ్‌సిరీస్‌ త్వరలో ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవనుంది.

Updated Date - Sep 05 , 2024 | 03:20 AM