రూ. వెయ్యి కోట్ల క్లబ్లో కల్కి
ABN , Publish Date - Jul 14 , 2024 | 03:00 AM
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ బెల్ట్‌లో, విదేశాల్లోనూ...
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ బెల్ట్‌లో, విదేశాల్లోనూ సంచలన వసూళ్లను సాధిస్తోంది. తాజాగా ‘కల్కి’ చిత్రం కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరింది. ఈ చిత్రం రూ. వెయ్యికోట్ల వసూళ్లను అందుకున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ శనివారం తెలిపింది. విడుదలైన మూడు వారాల తర్వాత కూడా బాక్సాఫీసు దగ్గర నిలకడైన వసూళ్లతో కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొనే, దిశాపటానీ కీలకపాత్రలు పోషించారు. సి. అశ్వనీదత్ నిర్మించారు.