Mowgli: సుమక్క తనయుడి మరో సినిమాకు క్లాప్ పడింది

ABN , Publish Date - Dec 19 , 2024 | 09:50 PM

సుమక్క తనయుడి రెండో చిత్రం ‘మోగ్లీ 2025’ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ వేడుకకు సందీప్ రెడ్డి వంగా, శ్రీకాంత్ ఓదెల వంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ హాజరయ్యారు. ఈ మూవీ ప్రారంభ విశేషాలలోకి వెళితే..

Mowgli 2025 Movie Opening

‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన సుమ కనకాల తనయుడు.. ఆ సినిమాతో అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఆ సినిమా యూత్‌ని ఆకర్షించినప్పటికీ.. కలెక్షన్స్‌ని మాత్రం సాధించలేకపోయింది. అయితే ఈసారి మాత్రం రోషన్‌కు పక్కా హిట్ అనేలా టీమ్ తయారైంది. అవును.. రోషన్ కనకాల రెండో సినిమాను.. తన తొలి చిత్రం ‘కలర్ ఫోటో’తో జాతీయ అవార్డును గెలుచుకుని యంగెస్ట్ దర్శకుడిగా గుర్తింపు పొందిన సందీప్ రాజ్ తెరకెక్కించబోతున్నారు. ‘మోగ్లీ 2025’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సందీప్ రాజ్ మరో ఎమోషనల్ రిచ్ స్టోరీని రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. సాక్షి సాగర్ మదోల్కర్‌ హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఈ సినిమాను గురువారం హైదరాబాద్‌లో లాంచనంగా ప్రారంభించారు.

Also Read- Director Shankar: రామ్ చరణ్‌‌లో ఏదో తెలియని శక్తి ఉంది.. అతనొక విస్ఫోటనం


ఈ సినిమా ముహూర్తపు వేడుకలో రోషన్ కనకాల, సాక్షి సాగర్ మదోల్కర్‌లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి సందీప్ రెడ్డి వంగా క్లాప్‌ కొట్టగా.. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కాంటెంపరరీ లవ్ స్టోరీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజనరీ ప్రొడ్యూసర్ TG విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు.


Mowgli.jpg

ఇప్పటికే వదిలిన రోషన్ కనకాల ఛార్మింగ్‌గా కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ పాజిటివ్ ఫీడ్ బ్యాక్‌ని రాబట్టుకోగా.. ‘మోగ్లీ 2025’ టైటిల్‌కు కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమాకు టాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ‘కలర్ ఫోటో’ సినిమాకు సక్సెస్ ఫుల్ సౌండ్‌ ట్రాక్స్ అందించిన కాల భైరవ సంగీతం సమకూర్చనుండగా.. బాహుబలి 1 & 2, RRR వంటి భారీ బ్లాక్‌బస్టర్‌లలో చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన రామ మారుతి ఎమ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ‘కలర్ ఫోటో, మేజర్’, రాబోయే ‘గూఢచారి 2’ చిత్రాలకు పని చేసిన పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా ఫైనల్ అయ్యారు. ఈ చిత్రాన్ని 2025 వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read-Sandhya Theatre Stampede: శ్రీ‌తేజ్‌ను పరామర్శించిన సుకుమార్.. ఏమన్నారంటే

Also Read-Mohan Babu: మోహన్ బాబుకి షాకిచ్చిన హైకోర్టు

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 19 , 2024 | 09:50 PM