రొమాంటిక్‌గా మరో సారి...

ABN , Publish Date - Oct 30 , 2024 | 05:46 AM

‘స్వామి రారా’, ‘కేశవ’ సినిమాల తర్వాత నిఖిల్‌ సిద్ధార్థ్‌, డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ కలయికలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. రుక్మిణీ వసంత్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు...

‘స్వామి రారా’, ‘కేశవ’ సినిమాల తర్వాత నిఖిల్‌ సిద్ధార్థ్‌, డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ కలయికలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. రుక్మిణీ వసంత్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. బీవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. నవంబర్‌ 8న ఈ చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్‌ ఫస్ట్‌ సింగిల్‌ ‘హే తార’ అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా, ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘నీతో ఇలా’ అని సాగే ఈ రొమాంటిక్‌ గీతంలో నిఖిల్‌ సిద్ధార్థ్‌, దివ్యాంశ కౌశిక్‌ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. రాకేందు మౌళి సాహిత్యం అందించగా.. కార్తీక్‌, నిత్యశ్రీ ఆలపించారు. ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, సంగీతం:కార్తీక్‌.

Updated Date - Oct 30 , 2024 | 08:39 AM