The 100: బర్త్‌డే స్పెషల్‌గా ఆర్కే సాగర్ స్పెషల్ పోస్టర్ విడుదల

ABN , Publish Date - Aug 16 , 2024 | 09:44 PM

బుల్లితెరపై స్టార్‌డమ్‌ని చూసిన ఆర్కే సాగర్.. వెండితెరపై తన సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్కే సాగర్ విభిన్న కథా చిత్రాలను చేస్తూ ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. ఆయన పుట్టినరోజు (ఆగస్ట్ 16) సందర్భంగా ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘ది 100’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

RK Sagar in The 100 Movie

బుల్లితెరపై స్టార్‌డమ్‌ని చూసిన ఆర్కే సాగర్ (RK Sagar).. వెండితెరపై తన సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్కే సాగర్ విభిన్న కథా చిత్రాలను చేస్తూ ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. మాస్ యాక్షన్ లవ్ స్టోరీలతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో నటుడిగా బిజీగా ఉన్నారు. ఆయన పుట్టినరోజు (ఆగస్ట్ 16) సందర్భంగా ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘ది 100’ (The 100) మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనను అభిమానించే వారు, జనసేన కార్యకర్తలు ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (Happy Birthday RK Sagar)

Also Read- 70th National Film Awards: ఉత్తమ నటులు, నాయికలు, చిత్రాల విజేతలు వీరే


The-100.jpg

‘ది 100’ చిత్రాన్ని క్రియా ఫిల్మ్ కార్ప్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు అంతర్జాతీయంగా ఎన్నో విశిష్టమైన అవార్డులు లభించాయి. మున్ముందు కూడా మరిన్ని అవార్డులు వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. ఇక బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌లో.. ఆర్కే సాగర్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది. ఆర్కే సాగర్ ప్రస్తుతం మంచి లైనప్‌తో ఉన్నారు. ఆల్రెడీ రెండు ప్రాజెక్టులు సెట్స్ మీద ఉన్నాయి. మరో క్రేజీ ప్రాజెక్టును పెద్ద బ్యానర్‌లో ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ మూవీ వివరాలను వెల్లడించనున్నారు. మరోవైపు తెలంగాణకు సంబంధించిన జనసేన పార్టీ (Janasena Party) వ్యవహారాలలో ఆయన చురుకుగా పాల్గొంటోన్న విషయం తెలిసిందే.

Read Latest Cinema News

Updated Date - Aug 16 , 2024 | 09:44 PM