Jai Hanuman: ‘జై హనుమాన్’లో హనుమంతుడిగా ఎవరంటే.. లుక్ వచ్చేసింది
ABN , Publish Date - Oct 30 , 2024 | 06:03 PM
‘హను-మాన్’ సినిమా ఘన విజయం తర్వాత సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘జై హనుమాన్’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హనుమండిగా ఎవరు చేస్తారనే దానిపై ఎంతో మంది స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. చివరిగా హనుమంతుడిగా నటించే నటుడు ఎవరో మేకర్స్ రివీల్ చేశారు.
విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ట్రూ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో చేతులు కలిపారు. ఈ ఎక్సయిటింగ్ న్యూ ప్రాజెక్ట్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి లీడ్ రోల్ పోషించనున్నారు. ఈ కొలాబరేషన్లో ‘జై హనుమాన్’ స్వరూపమే మారిపోయింది. ఇక ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ సినిమాలో హనుమంతుడిగా చేస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు లీకయ్యాయి. మేకర్స్ దీవాళి స్పెషల్‌గా హనుమంతుడి పాత్రతో కూడిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. హనుమంతుడిగా మొదటి నుండి వినిపిస్తున్న రిషబ్ శెట్టినే ఫైనల్ చేశారు. ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపుని, నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి రాకతో ఈ సినిమాపై అంచనాలు డబుల్ కాదు త్రిబుల్ అయ్యాయని చెప్పొచ్చు.
Also Read- యంగ్ చాప్ ఎన్టీఆర్ దర్శనం.. ఈ కటౌట్ విశేషాలివే
ఇక ‘హనుమాన్’గా నటించే నటుడిని రివీల్ చేయడంతో పాటు, చిత్ర నిర్మాతలు బ్రెత్ టేకింగ్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ పాత్ర సోల్‌ని ప్రజెంట్ చేస్తోంది. పోస్టర్లో రిషబ్ శెట్టి హనుమంతునిగా పవర్ ఫుల్ పోజ్‌లో, శ్రీరాముని విగ్రహం చేతిలో భక్తిపూర్వకంగా పట్టుకొని అతని పాదాల మీద కూర్చొని కనిపించారు. ఆయన కళ్లలో నీళ్లు కనిపిస్తున్నాయి. ఈ అద్భుతమైన పోస్టర్ రిషబ్ ఫిజికాలిటీని హైలైట్ చేయడమే కాకుండా హనుమంతునికి సంబంధించిన లోతైన భక్తి, శక్తిని ప్రజెంట్ చేస్తోంది. పాత్ర చిత్రీకరణ లెజెండరీ లక్షణాలతో సంపూర్ణం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అద్భుత పాత్రకు అతను తెరపై ఎలా జీవం పోస్తాడో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
Also Read- Yash: వివాదంలో యష్ ‘టాక్సిక్’.. అటవీ శాఖా మంత్రి ఫైర్
ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’తో మరింత గొప్ప కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు, ఈ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. ‘జై హనుమాన్’ అనేది విడదీయరాని శక్తి, విధేయతతో కూడిన హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిక్, సినిమా లెజెండ్‌ని పునర్నిర్వచించటానికి సెట్ చేయబడింది. హనుమంతుని మౌనం శరణాగతి కాదు, ప్రయోజనం కోసం వేచి ఉంది. జై హనుమాన్ అనేది విడదీయరాని భక్తికి, అన్ని అసమానతలను ధిక్కరించే ప్రతిజ్ఞ యొక్క బలానికి నివాళి. అమరస్ఫూర్తిని జరుపుకునే గొప్ప సినిమాటిక్ జర్నీని ఎక్స్ పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని మేకర్స్ ఈ పోస్టర్‌తో హింట్ ఇస్తున్నారు. ‘జై హనుమాన్’ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగం. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని మ్యాసీవ్ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.