Revu: తమన్నా ‘ఓదెల 2’ సెట్స్‌లో ‘రేవు’ ముచ్చట

ABN , Publish Date - Jul 28 , 2024 | 09:35 PM

‘ఓదెల 2’ సెట్స్‌లో ‘రేవు’ ముచ్చట పెట్టారు. వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రేవు’. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్‌ను ‘ఓదెల 2’ చిత్ర సెట్స్‌లో డైనమిక్ డైరెక్టర్ సంపత్ నంది, మిల్కి బ్యూటీ తమన్నా, హీరో వశిష్ఠ సింహ, మధు క్రియేషన్స్ అధినేత మధు.డి, డైరెక్టర్ అశోక్ తేజ, సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్‌ల సమక్షంలో విడుదల చేశారు.

Revu Release Date Poster Launch

‘ఓదెల 2’ సెట్స్‌లో ‘రేవు’ (Revu) ముచ్చట పెట్టారు. వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్‌పై నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ పర్యవేక్షకుడిగా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్‌ను ‘ఓదెల 2’ (Odela 2) చిత్ర సెట్స్‌లో డైనమిక్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi), మిల్కి బ్యూటీ తమన్నా (Milky Beauty Tamannaah), హీరో వశిష్ఠ సింహ, మధు క్రియేషన్స్ అధినేత మధు.డి, డైరెక్టర్ అశోక్ తేజ, సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్‌ల సమక్షంలో విడుదల చేశారు.

Also Read- Maruthi Nagar Subramanyam Trailer: నవ్వకుండా ఉండగలరేమో.. ట్రై చేయండి

ఈ సందర్భంగా మిల్కి బ్యూటీ తమన్నా భాటియా మాట్లాడుతూ.. ‘రేవు’ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ని లాంచ్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ పోస్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈ సినిమా సక్సెస్ సాధించి నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి‌లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుతున్నాను. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు‌కు.. ఇంకా యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. (Revu Release Date Poster Launch)


Odela-2-Revu.jpg

డైరెక్టర్ సంపత్ నంది మట్లాడుతూ.. నా మిత్రులైన డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి‌లకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ‘రేవు’ రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేయాలని అడిగారు. ‘ఓదెల 2’కి సంబంధించిన షూటింగ్ పెద్దపల్లి జిల్లా, ఓదెల గ్రామంలోని మల్లిఖార్జున దేవాలయంలో జరుగుతుందని, అక్కడికి వస్తే.. తమన్నా చేతుల మీదుగా విడుదల చేయవచ్చని వారిని ఆహ్వానించడం జరిగింది. ఆగస్ట్ 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కంటెంట్ గురించి నాకు తెలుసు. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతూ.. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ‘రేవు’ హీరో వంశీ, హేమంత్, పారిశ్రామిక వేత్త పారుపల్లి అనీల్, BDL నగేష్ పాల్గొన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 28 , 2024 | 09:35 PM