Ukku Satyagraham: విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం విడుదల ఎప్పుడంటే?

ABN , Publish Date - Aug 07 , 2024 | 03:34 PM

‘విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు’ నినాదంతో దర్శకనిర్మాత, హీరో జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణంలో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. గద్దర్ ఇందులో మూడు పాటలు పాడటంతో పాటు.. రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సన్నివేశాలలో నటించారని మేకర్స్ తెలిపారు.

Ukku Satyagraham Release Date Announcement

‘విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు’ నినాదంతో దర్శకనిర్మాత, హీరో జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణంలో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ (Revolutionary Poet Gaddar) నటించిన ఆఖరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’ (Ukku Satyagraham). ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. దర్శకనిర్మాత బి.నర్సింగరావు, తెలంగాణ రాష్ట్ర గీతం రూపశిల్పి అందెశ్రీ, గద్దర్ తనయుడు సూర్యం, జానపద కవి గోరేటి వెంకన్న, ప్రొఫెసర్ కోదండరాం, నందిని సిద్ధారెడ్డి, అల్లం నారాయణ వంటివారంతా కలిసి ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘ఉక్కు సత్యాగ్రహం’ చిత్రం ఈ నెల 30న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

Also Read- Prabhas: ప్రభాస్ ఫర్ ఏ రీజన్.. వయనాడ్ బాధితుల సహాయార్థం భారీ విరాళం

విప్లవ కవి గద్దర్ ఇందులో మూడు పాటలు పాడటంతో పాటు.. రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సన్నివేశాలలో నటించారని.. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ ఈ సినిమాకు అద్భుతమైన సాహిత్యం అందించారని మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు. (Ukku Satyagraham Release Date Announcement)


Ukku-Satyagraham.jpg

ఈ కార్యక్రమంలో దర్శకుడు, నిర్మాత, కథానాయకుడైన సత్యారెడ్డి (Satya Reddy) మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా, భూనిర్వాసితులకి న్యాయం జరిగేలా ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమాని ఒక గ్రంధంలా, కళా ఖండంలా మూడు సంవత్సరాలు పాటు ఎంతో కష్టపడి నిర్మించాం. నిజమైన స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్, ఎంప్లాయిస్, భూనిర్వాసితులు, ఎంతోమంది మేధావులు, కవులు, కళాకారుల, రచయితలు కూడా ఈ చిత్రంలో నటించారు. ఢిల్లీ ఇండియా గేట్, జంతర్ మంతర్, ఆంధ్రప్రదేశ్ భవన్, సింగరేణి కోల్ మైన్స్, విశాఖపట్నం ప్రాంతాల్లోని వివిధ లొకేషన్లలో షూటింగ్ చేశాం.

Ukku-Gaddar.jpg

ఇదే గద్దరన్న చివరి చిత్రం అవుతుందని అనుకోలేదు. ఆయన ఈ సినిమా కోసం మూడు పాటలు పాడారు. కొన్ని సన్నివేశాలలో నటించారు. అవన్నీ కూడా హైలెట్ అనేలా ఉంటాయి. ఈ సినిమా కోసం ఎంతో మంది కృషి చేశారు. వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఆగస్ట్ 30వ తేదిన ప్రపంచం వ్యాప్తంగా రెండు వందలకు పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Aug 07 , 2024 | 03:34 PM