రేణు దేశాయ్ చండీ హోమం
ABN , Publish Date - Oct 20 , 2024 | 02:08 AM
శరత్ పూర్ణిమ సందర్భంగా గణపతి, చండీ హోమం చేశారు సినీ నటి రేణు దేశాయ్. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పూజలో అకీరా నందన్ కూడా పాల్గొన్నాడు...
శరత్ పూర్ణిమ సందర్భంగా గణపతి, చండీ హోమం చేశారు సినీ నటి రేణు దేశాయ్. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పూజలో అకీరా నందన్ కూడా పాల్గొన్నాడు. ‘మన పూర్వీకులు అనుసరించిన సాంప్రదాయాలు, ఆచారాలను పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనపై ఉంది. డెకరేషన్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ఆర్భాటంగా పూజలు చేసుకోవడానికి బదులుగా ఇలా హోమం, పూజలపైనే ఫోకస్ చేస్తే సరిపోతుంది’ అని రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.