రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ABN , Publish Date - Oct 30 , 2024 | 05:47 AM

ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో హీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్‌ డాలీ ధనంజయ నటించిన మల్టీ స్టారర్‌ చిత్రం ‘జీబ్రా’. ‘లక్‌ ఫేవర్స్‌ ద బ్రేవ్‌’ దీని ట్యాగ్‌లైన్‌. ఎస్‌.ఎన్‌.రెడ్డి, పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మాతలు...

ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో హీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్‌ డాలీ ధనంజయ నటించిన మల్టీ స్టారర్‌ చిత్రం ‘జీబ్రా’. ‘లక్‌ ఫేవర్స్‌ ద బ్రేవ్‌’ దీని ట్యాగ్‌లైన్‌. ఎస్‌.ఎన్‌.రెడ్డి, పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మాతలు. నవంబరు 22న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. పోస్టర్‌లో సత్యదేవ్‌, డాలీ ధనంజయ ఫెరోసియ్‌సగా కనిపించారు. బ్యాక్‌ డ్రాప్‌లో కరెన్సీ నోట్లు, లైట్‌ హౌస్‌, ఫ్యాక్టరీ మొదలైన ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌, మోషన్‌ వీడియో, టీజర్‌తో మేకర్స్‌ క్యూరియాసిటీని పెంచారు. టీజర్‌ మంచి రెస్పాన్స్‌తో భారీ అంచనాలను నెలకొల్పింది.

Updated Date - Oct 30 , 2024 | 08:40 AM