రియల్ కోర్ట్ డ్రామా ఎలా ఉంటుందో చూపించే థ్రిల్లర్‌.. గ్లింప్స్ వదిలారు

ABN , Publish Date - Dec 10 , 2024 | 10:45 PM

అసలు సిసలైన కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంటుందో చూపిస్తామని అంటున్నారు ‘లీగల్లీ వీర్’ టీమ్. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ గురించి హీరో వీర్ రెడ్డి ఏం చెప్పారంటే..

Legally Veer Glimpse Launch Event

సిల్వర్ కాస్ట్ బ్యానర్‌పై స్వర్గీయ ఎం. వీరనారాయణ రెడ్డి సమర్పణలో వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘లీగల్లీ వీర్’. ఈ చిత్రానికి శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా.. రవి గోగుల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఇదొక కోర్టు డ్రామా చిత్రమనేది అర్థమవుతోంది. మేకర్స్ కూడా అదే చెబుతున్నారు. ఈ సందర్భంగా

Also Read-మనోజ్.. మీ అమ్మ హాస్పిటల్ పాలైందిరా: మోహన్ బాబు వాయిస్ మెసేజ్ వైరల్

హీరో వీర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నాకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు. కరోనా టైంలో పాడ్ కాస్ట్ చేయాలని అనుకున్నాను. ఆ టైంలో నాకు సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. మంచి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు, లీగల్ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్రను చేయడం సులభంగా అనిపించింది. ఇంతవరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను. నటనకు కొత్త కావడంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా టేక్స్ తీసుకున్నాను. డబ్బింగ్‌లో ప్రాబ్లం వచ్చింది కానీ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులకు రియల్ కోర్ట్ డ్రామా ఎలా ఉంటుందో చూపించే థ్రిల్లర్‌ చిత్రమిది. డిసెంబర్ 27 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం..’’ అని తెలిపారు.  


డైరెక్టర్ రవి మాట్లాడుతూ.. ‘వీర్ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపిస్తుంది. గ్లింప్స్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా సినిమాను మీడియా ప్రోత్సహించి, ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ వల్లం కళాధర్, నటుడు గిరిధర్ వంటి వారు మాట్లాడుతూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.

Also Read-Mohan Babu: అన్నదమ్ముళ్లులా కలిసి బ్రతకాలని కోరుకుంటే.. మోహన్ బాబు ట్వీట్ వైరల్

Also Read-Manchu Family: మనోజ్ హాస్పిటల్‌ల్లో.. మోహన్ బాబు ట్విట్టర్‌లో.. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 10 , 2024 | 10:46 PM