రీ ఎంట్రీకి రెడీ

ABN , Publish Date - Dec 18 , 2024 | 02:27 AM

కథ, కాంబినే షన్‌, దర్శకుడు... ఇలా అన్నీ కుదిరితే మళ్లీ సంగీత దర్శకుడిగా పనిచేయడానికి తాను సిద్ధం అని రమణ గోగుల చెప్పారు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన వెంకటేశ్‌ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’...

కథ, కాంబినే షన్‌, దర్శకుడు... ఇలా అన్నీ కుదిరితే మళ్లీ సంగీత దర్శకుడిగా పనిచేయడానికి తాను సిద్ధం అని రమణ గోగుల చెప్పారు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన వెంకటేశ్‌ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలోని ‘గోదారి గట్టు’ పాటను ఆలపించారు. ఇటీవలే విడుదలైన ఆ గీతానికి చక్కని స్పందన దక్కుతోంది. ఈ సందర్భంగా రమణ గోగుల మీడియాతో మాట్లాడుతూ... ‘నాకు సాంకేతిక పరిజ్ఞానం అంటే ఆసక్తి ఎక్కువ. కృత్రిమమేధ, డేటా ఎనలిటిక్స్‌ విభాగాల్లో పలు ప్రాజెక్ట్‌లు చేశాను. ఓ రోజు సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో ఫోన్‌ చేసి వెంకటేశ్‌ సినిమా కోసం ఓ పాట పాడాలని అడిగారు. భాస్కరభట్ల సాహిత్యం నచ్చింది. పాట విడుదలయ్యాక చక్కటి స్పందన వచ్చింది. వెంకటేశ్‌ ఫోన్‌ చేసి ప్రశంసించారు. మధు ప్రియ కూడా అద్భుతంగా పాడింది.


పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ పర్సన్‌. చాలా కొత్తగా ప్రయత్నిస్తారు. ఫస్ట్‌ టైం తెలుగు సినిమాల్లో ఇంగ్లీష్‌ పాటను ఆయన సినిమా కోసమే కంపోజ్‌ చేశారు. ఇప్పుడు కృత్రిమమేధ వల్ల గాయకుడు పాట పాడాల్సిన అవసరం లేకుండాపోయింది. ఆటోమేటిగ్గా సాంగ్‌ వస్తుంది. అయితే మనిషి పాడితేనే ఆ పాటకు ప్రాణం వస్తుంది’ అని చెప్పారు.

Updated Date - Dec 18 , 2024 | 02:27 AM