గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో రజాకార్
ABN , Publish Date - Nov 05 , 2024 | 06:43 AM
భారతీయ చలన చిత్రోత్సవంలో రజాకార్ సినిమాకు గుర్తింపు దక్కింది. ప్రతి ఏడాది గోవాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్ అఫ్ ఇండియా (ఐఎ్‌ఫఎ్‌ఫఐ)లో ఉత్తమ తొలి దర్శకుడు(బెస్ట్ డెబ్యూ డైరెక్టర్) కేటగిరీకి ఈ సినిమా దర్శకుడు...
భారతీయ చలన చిత్రోత్సవంలో రజాకార్ సినిమాకు గుర్తింపు దక్కింది. ప్రతి ఏడాది గోవాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్ అఫ్ ఇండియా (ఐఎ్‌ఫఎ్‌ఫఐ)లో ఉత్తమ తొలి దర్శకుడు(బెస్ట్ డెబ్యూ డైరెక్టర్) కేటగిరీకి ఈ సినిమా దర్శకుడు యాట సత్యనారాయణ నామినేట్ అయ్యారు. ఈ మేరకు సోమవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉత్తమ తొలి దర్శకుల కేటగిరీలో నామినేట్ అయిన వారిలో రజాకార్ (తెలుగు) దర్శకుడు యాట సత్యనారాయణతో పాటు బూంగ్(మణిపురి) దర్శకురాలు లక్ష్మీప్రియా దేవి, ఘరత్ గణపతి(మరాఠీ) దర్శకుడు నవజ్యోత్ బండివాడేకర్, మిక్కా బన్నాడ హక్కి (కన్నడ) దర్శకుడు మనోహర, థానుప్ (మలయాళం) దర్శకుడు రాగేశ్ నారాయణన్ ఉన్నారు. గోవాలో ఈ నెల 28న జరిగే ముగింపు వేడుకలో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిని ఎంపిక చేస్తారు.
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి)