Jathara: దేవునితో మనిషి ఆడించే పితలాటకం.. ‘జాతర’ ఫస్ట్ లుక్ విడుదల

ABN , Publish Date - Aug 09 , 2024 | 05:59 PM

ప్రజంట్ ప్రేక్షకులు కోరుకుంటున్న కొత్తదనాన్ని ఇచ్చేలా.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘జాతర’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు సతీష్ బాబు. తాజాగా ఈ ‘జాతర’ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ‘జాతర’ చిత్రానికి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించడమే కాకుండా సతీష్ బాబు హీరోగానూ నటించారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే సతీష్ బాబు ఈ చిత్రంలో ఎంత రా అండ్ రస్టిక్‌గా కనిపించబోతున్నారో అర్థమవుతోంది.

Jathara First Look Poster

టాలెంట్ ఉంటే చాలు.. టాలీవుడ్‌లో రాణించడం పెద్ద కష్టమే కాదని ఇప్పటికే ఎందరో నిరూపించారు.. నిరూపిస్తూనే ఉన్నారు. ప్రజంట్ ట్రెండ్ ఏమిటంటే.. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవారు ఒక శాఖనే నమ్ముకోవడం లేదు. కొంత మంది మల్టీటాలెంట్ చూపిస్తూ కథ స్వయంగా రాసుకుని దర్శకత్వం చేయడం, వారే హీరోలుగా నటించడం.. ఇలా ఇండస్ట్రీలో ఏదో రకంగా ప్రేక్షకుల మన్ననలు పొందాలని చూస్తున్నారు. ప్రస్తుతం రొటీన్ కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో.. కొత్త, పాత అనే తేడా లేకుండా సినిమాలు ఆదరణను పొందుతున్నాయి. ప్రజంట్ ప్రేక్షకులు కోరుకుంటున్న కొత్తదనాన్ని ఇచ్చేలా.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘జాతర’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు సతీష్ బాబు. తాజాగా ఈ ‘జాతర’ ఫస్ట్ లుక్‌ (Jathara First Look)ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ.. సమంతకు అక్క అవుతుందా? ఈ ట్విస్టేంటి?

ఈ ‘జాతర’ చిత్రానికి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగానూ నటించారు సతీష్ బాబు (Sathish Babu). గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టిన మేకర్స్ శుక్రవారం చిత్ర ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే సతీష్ బాబు ఈ చిత్రంలో ఎంత రా అండ్ రస్టిక్‌గా కనిపించబోతున్నారో అర్థమవుతోంది. శత్రువులను వదించేందుకు కత్తి పట్టుకుని ఉన్నట్టుగా పోస్టర్‌ను డిజైన్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో అమ్మవారి ఫోటో, జాతరలో పూనకాలు వచ్చినట్టుగా గెటప్, లుక్ అన్నీ కూడా మాస్ ట్రీట్ అన్నట్లుగా ఉన్నాయి. ‘దేవుడు ఆడే జగన్నాటకంలో.. ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం’ అంటూ పోస్టర్ మీద రాసి ఉన్న క్యాప్షన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని కలిగిస్తోంది. (Jathara First Look Out)


Jathara-First-Look.jpg

చిత్తూరు జిల్లాలో జరిగే ‘జాతర’ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, పాలేటి గంగమ్మ దేవత (Paleti Gangamma Devatha) బ్యాక్‌డ్రాప్‌గా కథను రెడీ చేసినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటి వరకు ‘జాతర’ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు, ఈ సినిమాకు చాలా డిఫరెన్స్ ఉంటుందని, ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ అవుతారని, త్వరలోనే ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో దీయా రాజ్ కథానాయికగా నటిస్తుండగా.. ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read- NTR: ఎన్టీఆర్ పేరుతో మరో వారసుడు.. ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్


Read Latest Cinema News

Updated Date - Aug 09 , 2024 | 05:59 PM