Ravi Teja: 'నేను శైలజ' దర్శకుడితో రవితేజ సినిమా
ABN , Publish Date - Jul 30 , 2024 | 01:54 PM
రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమా ఆగస్టు 15న విడుదలకి సిద్ధంగా వుంది. తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్నారు రవి తేజ. ఇవి కాకుండా ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నారని తెలిసింది.
రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమా ఈ ఆగస్టు 15న విడుదలకి సిద్ధం అవుతోంది. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకుడు, ఈ సినిమా అజయ్ దేవగన్ నటించిన హిందీ సినిమా 'ది రైడ్' సినిమాకి అనువాదం. ఈ సినిమా తరువాత రవితేజ దర్శకుడు గోపీచంద్ మలినేనితో (Gopichand Malineni) సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు. వారిద్దరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా. ఇంతకు ముందు వారిద్దరూ కలిపి 'డాన్ శీను', 'బలుపు', 'క్రేక్' సినిమాలు చేశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిపి నాలుగో సినిమాకి శ్రీకారం చుట్టారు, ఇందులో శ్రీలీల కథానాయిక. (Kishore Tirumala to direct Ravi Teja in his next, says a source)
ఈ సినిమా తరువాత రవితేజ ఇంకొక సినిమా కూడా ఒప్పుకున్నారని తాజా సమాచారం. 'నేను శైలజ' లాంటి మంచి విజయాన్ని అందించిన కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకుడిగా పని చేస్తారని తెలుస్తోంది. కిషోర్ తిరుముల చివరి సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', శర్వానంద్ ఇందులో కథానాయకుడు. ఇది 2022లో వచ్చింది. ఆ తరువాత కిషోర్ తిరుమల తన కథపై పనిచేస్తూ వున్నారని, ఈమధ్యనే రవితేజకి కథని వినిపించడం జరిగిందని కూడా తెలిసింది. (Ravi Teja is signed another film with director Kishore Tirumala)
కథ నచ్చి రవితేజ సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని ఎవరు నిర్మిస్తారు అనే విషయం కూడా కొన్ని రోజుల్లో తెలియనుంది చెపుతున్నారు. కిషోర్ తిరుమల మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు, అలాగే క్లీన్ సినిమాలు నిర్మిస్తారని కుటుంబం అంతా చూసీ విధంగా వుంటాయి. కిషోర్ మంచి రచయిత కూడాను. ఇప్పుడు కిషోర్ తిరుమల, రవి తేజ కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా ఉండబోతోందని అంటున్నారు.