Rashmika Mandanna: డబ్బే డబ్బు.. ‘కుబేర’‌ రష్మిక మందన్నా గ్లింప్స్ వైరల్

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:03 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ శేఖర్ కమ్ముల మోస్ట్ ఎవైటెడ్ మైథలాజికల్ పాన్-ఇండియన్ చిత్రం ‘కుబేర’. ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది. శుక్రవారం మేకర్స్ రష్మిక ఫస్ట్ లుక్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ని రివీల్ చేశారు.

Rashmika Mandanna in Kubera Movie

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), టాలీవుడ్ కింగ్ నాగార్జున (King Nagarjuna), నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మోస్ట్ ఎవైటెడ్ మైథలాజికల్ పాన్-ఇండియన్ చిత్రం ‘కుబేర’ (Kubera). ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ వదిలిన ధనుష్, నాగార్జున క్యారెక్టర్స్‌ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి స్పందనను రాట్టుకున్న విషయంలో తెలిసిందే. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్ర పోషిస్తోంది. శుక్రవారం మేకర్స్ రష్మిక ఫస్ట్ లుక్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ని రివీల్ చేశారు.

Also Read-Shyamala Devi: అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై ప్రభాస్‌తో సినిమా చేయిస్తా..

ఈ ఫస్ట్ లుక్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌‌లో ఆమె ఎక్స్‌ట్రార్డినరీ‌గా, డిఫరెంట్ అవతార్‌లో కనిపించి ప్రేక్షకులలో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ లుక్ థ్రిల్లింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా గ్లింప్స్‌లో ఆమె గుణపంతో తవ్వి తీసిన బ్రీఫ్‌కేస్‌లో ఉన్న డబ్బు చూస్తుంటే.. టైటిల్‌కు పర్ఫెక్ట్‌గా సింక్ అవుతూ సినిమాపై మరింతగా క్యూరియాసిటీని పెంచుతోంది. ‘కుబేర’లో ఏదో గట్టిగానే చెప్పబోతున్నారనే హింట్ కూడా ఇచ్చినట్లయింది. ఆకట్టుకునే విజువల్స్‌తో, శేఖర్ కమ్ముల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషల్ డ్రామాలో రష్మికకు డిఫరెంట్ క్యారెక్టర్‌ని డిజైన్ చేశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ కట్టిపడేస్తోంది. (Rashmika Mandanna First Look Glimpse)


Rashmika-Kubera.jpg

నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ కాస్ట్‌తో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ‘కుబేర’ చిత్రం (Kubera Movie) ప్రస్తుతం మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటి. జిమ్ సర్భ్ మరో ప్రముఖ పాత్రలో కనిపించనున్న ఈ హై-బడ్జెట్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుపుకుంటోంది. మరో వైపు షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 05 , 2024 | 05:16 PM