Rashmika Mandanna: అత్యుత్తమంగా నటించాననిపించింది
ABN , Publish Date - Mar 02 , 2024 | 06:10 PM
'పుష్ప’ (Pushpa 2) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం అందుకోవడంతో దానికి కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప: ది రూల్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టే దర్శకుడు సుకుమార్ (Sukumar) కూడా అంతకుమించి ఈ చిత్రం ఉండాలనే ఉద్దేశంలో చిత్రాన్ని చెక్కుతూ ఉన్నారు.

'పుష్ప’ (Pushpa 2) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం అందుకోవడంతో దానికి కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప: ది రూల్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టే దర్శకుడు సుకుమార్ (Sukumar) కూడా అంతకుమించి ఈ చిత్రం ఉండాలనే ఉద్దేశంలో చిత్రాన్ని చెక్కుతూ ఉన్నారు. అల్లు అర్జున్ (Allu arjun) తనదైన శైలిలో మాస్ రోల్‌లో మెప్పించారు. డీ గ్లామర్ రోల్‌లో శ్రీవల్లిగా నేషనల్ క్రష్ రష్మిక (Rashmika mandanna) అదే స్థాయిలో అలరించింది. తాజాగా పుష్ప-2పై రష్మిక తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
''మొదటి పార్ట్‌లో పుష్పకు ప్రియురాలిగా కనిపించా. రెండో పార్ట్‌లో భార్యగా కనిపిస్తాను. ఆ పాత్రకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఈ సీక్వెల్ మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. సుకుమార్ ప్రతీ సన్నివేశాన్ని పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం సూపర్‌సక్సెస్ కావడంతో రెండో పార్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక సీన ఎంతగా రక్తి కట్టించగలం అనేది ఆయా ఆర్టిస్టులపై ఆధారపడి ఉంటుంది.. ‘పుష్ప 2’ విషయానికొస్తే ఒక రోజు నేను అత్యుత్తమంగా నటించానని అనిపించింది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టీమ్‌కు నేను మరింత దగ్గరయ్యాను. షూటింగ్ కోసం వెళ్లగానే సొంత ఇంటికి వెళ్లినట్లు అనిపించింది’ అని అన్నారు.
టోక్యోలో జరగనున్న క్రంచీ రోల్ అనిమే అవార్డుల వేడకకు హాజరయ్యేందుకు రష్మిక జపాన్ వెళ్లారు. ఈ వేడుకల గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఈ ఈవెంట్ కోసం, ఇక్కడి వారందరినీ కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ వేడుకకు హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు సహజంగానే సిగ్గు ఎక్కువ. ఇప్పుడు అది ఇంకాస్త ఎక్కువైంది’’ అని అన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నారు. మైతీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.