దేవర 2లో రణ్‌బీర్‌, రణ్‌వీర్‌?

ABN , Publish Date - Oct 12 , 2024 | 02:19 AM

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో ఘన విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి కొనసాగింపుగా...

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో ఘన విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న ‘దేవర 2’ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘దేవర’ చిత్రంలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, కథానాయికగా జాన్వీకపూర్‌ నటించారు. వీరితో పాటు రెండో భాగంలో మరికొందరు బాలీవుడ్‌ తారలు భాగమవననున్నారని ఆయన చెప్పారు. ‘దేవర 2’లో కొన్ని అతిథి పాత్రలు ఉన్నాయి. అవి కథలో చాలా కీలకంగా ఉంటాయి. రణ్‌వీర్‌సింగ్‌, రణ్‌బీర్‌కపూర్‌ లాంటి బాలీవుడ్‌ స్టార్స్‌ ఆ పాత్రల్లో నటిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది.


ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. జరుగుతుందో లేదో తెలియదు కాబట్టి ఇప్పుడే దీని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. కొంతమంది తెలుగు, తమిళ హీరోలు అయినా ఆ పాత్రలు పోషిస్తే బావుంటుంది. వారి పేర్లు చెబితే ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలవుతాయి కాబట్టి చెప్పడం లే దు. త్వరలోనే వివరాలు ప్రకటిస్తాం’ అన్నారు.

Updated Date - Oct 12 , 2024 | 02:19 AM