రానా సరికొత్త టాక్‌ షో

ABN , Publish Date - Nov 14 , 2024 | 04:00 AM

సెలబ్రిటీల జీవితాల్లోని ఎవరికీ తెలియని కోణాలను ఆవిష్కరించే వెబ్‌ సిరీస్‌ ‘ద రానా దగ్గుబాటి షో’ ఈనెల 23 నుంచి ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవనుంది. ఈ ప్రోగ్రామ్‌ని స్పిరిట్‌ మీడియా బేనర్‌పై....

సెలబ్రిటీల జీవితాల్లోని ఎవరికీ తెలియని కోణాలను ఆవిష్కరించే వెబ్‌ సిరీస్‌ ‘ద రానా దగ్గుబాటి షో’ ఈనెల 23 నుంచి ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవనుంది. ఈ ప్రోగ్రామ్‌ని స్పిరిట్‌ మీడియా బేనర్‌పై రానా నిర్మించి హోస్ట్‌ చేస్తున్నారు. ఈ సరికొత్త అన్‌స్ర్కిప్టెడ్‌ ఒరిజినల్‌ సిరీస్‌ ఎనిమిది ఎపిసోడ్లు ఉంటుంది. ఇందులో ప్రముఖ సెలబ్రిటీలు అన్‌ ఫిల్టర్డ్‌ సంభాషణలు, ఎక్సయిటింగ్‌ యాక్టివిటీస్‌లో పాల్గొంటారు. దుల్కర్‌ సల్మాన్‌, నాగచైతన్య అక్కినేని, సిద్దూ జొన్నలగడ్డ, శ్రీలీల, నాని, ఎస్‌ఎస్‌ రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ వంటి సెలెబ్రిటీలు పాల్గొంటారు. ‘సెలెబ్రిటీల వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేక కోణాన్ని ‘ద రానా దగ్గుబాటి షో’ చూపుతుంది’ అని అన్నారు ప్రైమ్‌ వీడియో ఇండియా ఒరిజనల్స్‌ హెడ్‌ నిఖిల్‌ మధోక్‌.

Updated Date - Nov 14 , 2024 | 04:00 AM