Rana Daggubati: అమెజాన్ కోసం రానా దగ్గుబాటి చేస్తున్న సంచలన ప్రయోగం

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:25 AM

గత రెండు సంవత్సరాల నుండి ఒక్క తెలుగు సినిమా కూడా వొప్పుకొని రానా, రానున్న రోజుల్లో రెండు మూడు తెలుగు సినిమాలతో బిజీ అవబోతున్నాడని సమాచారం. అలాగే ఒక పక్క నిర్మాతగా చిన్న, పెద్ద సినిమాలు చేస్తూ వస్తున్న రానా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కోసం ఒక సంచలన షో కూడా చేస్తున్నాడని తెలిసింది

Rana Daggubati

ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి తెలుగులో సినిమా చేసి చాలా కాలం అయింది. 2022 లో పవన్ కళ్యాణ్ తో చేసిన 'భీమ్లా నాయక్' తరువాత వచ్చిన 'విరాట పర్వం' విడుదలైన తరువాత, రానా తెలుగు సినిమా చెయ్యలేదు. సుమారు రెండు సంవత్సరాలకి పైగా అయింది, రానా తెలుగు సినిమా వొప్పుకొని. అయితే ఇప్పుడు రానా దగ్గుబాటి తమిళ సినిమా చేస్తున్నారు. రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 'వెట్టియాన్' లో రానా విలన్ గా నటిస్తున్నాడు. దీనికి 'జై భీం' ఫేమ్ టిజె జ్ఞానవేల్ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా కొంచెం మిగిలి వుంది అని తెలిసింది. (Rana Daggubati is tie up with Amazon Prime for a show called 'The Rana Connection)

ranadaggubatisingle.jpg

ఇదిలా ఉండగా రానా దగ్గుబాటి ఈమధ్య చాలా చిన్న సినిమాలని ప్రోత్సహిస్తున్నాడు. ఇంతకు ముందు 'పరేషాన్' అనే సినిమాని ప్రోత్సహించినట్టుగానే ఇప్పుడు '35' అనే సినిమాకి రానా ముందుండి నడిపిస్తున్నాడు. అలాగే మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తో ఒక సినిమా నిర్మిస్తున్నాడు రానా. ఈ సంవత్సరం ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది. (Rana Is playing villain in Rajnikanth starrer 'Vettaiyan')

ranadaggubati1.jpg

ఇవి కాకుండా రానా దగ్గుబాటి అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒక షో చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ షో కి 'ది రానా కనెక్షన్' అని పిలుస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటి దక్షిణాదికి చెందిన అగ్ర నటులను ఒక దగ్గరకి చేర్చి వారితో సంభాషించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంతకు ముందు నటులతో చాలా షో లు వచ్చినా, రానా ఇది తన మార్కు వుండేటట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో వెళుతున్నట్టుగా తెలిసింది. ఈ షో కోసమని రామానాయుడు స్టూడియో లో ఒక సెట్ కూడా తయారవుతోంది అని వినికిడి. అలాగే కొన్ని తెలుగు సినిమాలు కూడా ఈ సంవత్సరం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవన్నీ కాకుండా 'రానా నాయుడు' వెబ్ సిరీస్ రెండో సీజన్ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో తన చిన్నాన్న వెంకటేష్ తో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ అద్భుతమైన విజయం సాధించింది.

Updated Date - Jul 05 , 2024 | 10:25 AM