రెండు భాగాలుగా రామాయణ
ABN , Publish Date - Nov 07 , 2024 | 04:19 AM
రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీత, యశ్ రావణుడిగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమాను ప్రకటించిన సంవత్సరం తర్వాత ఎట్టకేలకు బుధవారం నాడు....
రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీత, యశ్ రావణుడిగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమాను ప్రకటించిన సంవత్సరం తర్వాత ఎట్టకేలకు బుధవారం నాడు దాని వివరాలను నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా రెండు భాగాలుగా చిత్రాన్ని రూపొందిస్తున్నామనీ, తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల అవుతాయనీ సోషల్ మీడియా వేదికగా నమిత్ వెల్లడించారు. నితిశ్ తివారి రూపొందిస్తున్న ఈ సినిమాలో టీవీ రాముడు అరుణ్ గోవిల్ దశరథుని పాత్రను, లారా దత్తా కైక పాత్రను పోషిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ సటిస్తారని అంటున్నారు.
రాముడి పాత్ర కోసం రణబీర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మందు తీసుకోవడం మానేసిన రణబీర్ నిష్టగా ఉంటున్నాననీ, సంభాషణలలో స్పష్టత కోసం శిక్షణ పొందుతున్నాననీ ఆయన చెప్పారు. ఓ భక్తురాలుగా సీత పాత్రను పోషిస్తున్నట్లు సాయిపల్లవి ఇప్పటికే ప్రకటించారు.