Ramam Raghavam: దర్శకుడు సుకుమార్ వదిలిన హార్ట్ టచింగ్ సాంగ్

ABN , Publish Date - Sep 05 , 2024 | 05:24 PM

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణంలో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం ‘రామం రాఘవం’. నటుడు ధనరాజ్ కొరనాని ప్రధాన పాత్రలో నటిస్తూ.. మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గురుపూజోత్సవం స్పెషల్‌గా ఈ సినిమా నుంచి హార్ట్ టచింగ్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

Ramam Raghavam Telisinda Nedu Lyrical Song Launch Event

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణంలో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం ‘రామం రాఘవం’ (Ramam Raghavam). నటుడు ధనరాజ్ కొరనాని ప్రధాన పాత్రలో నటిస్తూ.. మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గురుపూజోత్సవం సందర్బంగా గురువారం ఈ మూవీ నుండి ‘తెలిసిందా నేడు’ (Telisinda Nedu Lyrical Song) అనే పాటను దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Tollywood: సాయి ధరమ్, వరుణ్ తేజ్.. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..

ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా సాగే ఈ మెలోడీ సాంగ్ విడుదలైన కొద్దిసేపటిలోనే వైరల్ అవుతుండటం విశేషం. తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్‌ను కాప్చర్ చేస్తూ చిత్రీకరించిన ఈ పాట వినగానే అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అరుణ్ చిలువేరు సంగీతం అందించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. శ్రీకాంత్ హరిహరన్ ఆలపించారు. పాటలో చూపించిన సన్నివేశాలు నేచురల్‌గా ఉండటంతో పాటు.. సినిమాటోగ్రఫీ హైలెట్ అనేలా ఉంది.


Sukku.jpg

మోక్ష, హరీష్ ఉత్తమన్, సునీల్, సత్య, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి ‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందించగా.. అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, దుర్గా ప్రసాద్ కెమెరామెన్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలో తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

Read Latest Cinema News

Updated Date - Sep 05 , 2024 | 05:24 PM