మేడమ్‌ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్‌ విగ్రహం?

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:49 AM

లండన్‌లో ఉన్న మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన హీరో రామ్‌చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. రామ్‌చరణ్‌ పాపులారిటీ, ఆయన ఫాలోయింగ్‌ను..

లండన్‌లో ఉన్న మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన హీరో రామ్‌చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. రామ్‌చరణ్‌ పాపులారిటీ, ఆయన ఫాలోయింగ్‌ను గమనించిన మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన విగ్రహం తయారీలో సహకరించడం కోసం రామ్‌చరణ్‌ లండన్‌లోనే ఉన్నారు. ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. రామ్‌చరణ్‌ ఫ్రెంచ్‌ బార్బేట్‌ జాతికి చెందిన ఓ కుక్క పిల్ల రైమ్‌ను పెంచుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఏ దేశం సందర్శించినా తమతో పాటు రైమ్‌ను తీసుకెళ్లడం రామ్‌చరణ్‌ దంపతులకు అలవాటు. అందుకే రైమ్‌ను ఎత్తుకుని ఉన్న రామ్‌చరణ్‌ మైనపు బొమ్మనే మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

Updated Date - Jul 16 , 2024 | 04:49 AM