Ram Charan: క్రికెట్‌కు సచిన్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు ఆ డైరెక్టర్ అలా..

ABN , Publish Date - Dec 22 , 2024 | 07:41 PM

నాతో కాకపోయినా ఎవరితో అయినా సరే ఓ తెలుగు సినిమా చేయండని అడుగుదామని కూడా ఆ డైరెక్టర్‌ని అడగలేకపోయాను. ఇప్పుడా డైరెక్టర్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. విషయంలోకి వస్తే..

Global Star Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమా జనవరి 10న విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో..

గ్లోబ‌ల్ స్టార్‌ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘శంకర్ గారు చేసిన ‘స్నేహితుడు’ సినిమాకు గెస్ట్‌గా వెళ్లాను. ఆ టైంలో ఆయనతో మాట్లాడేందుకు కూడా చాలా టెన్షన్ పడ్డాను. నాతో కాకపోయినా ఎవరితో అయినా సరే ఓ తెలుగు సినిమా చేయండని అడుగుదామని కూడా అడగలేకపోయాను. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఆయన. ఇంకా చెప్పాలంటే క్రికెట్‌కు సచిన్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు శంకర్ గారు అలా. డైరెక్టర్లకే డైరెక్టర్ ఆయన. అలాంటి శంకర్ గారితో పని చేయడం నా అదృష్టం. నా నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోంది. ‘గేమ్ చేంజర్’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ మూవీ ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు. ఏం సాధించాలన్నా సహనం ఉండాలి. ‘పుష్ప 2’తో సుకుమార్ గారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అలాంటి సుకుమార్ గారు మా ఈవెంట్‌కు వచ్చి మాట్లాడటం ఆనందంగా ఉంది. దిల్ రాజు గారితో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.తమన్ మాట్లాడుతూ.. శంకర్ గారితో పని చేసే ఛాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. పైగా రామ్ చరణ్, శంకర్ కాంబోలో నాకు ఛాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇవన్నీ అనుకుంటే.. గేమ్ చేంజర్ అని టైటిల్ పెట్టడంతో మరింత ప్రెజర్ పెరిగింది. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు వస్తున్నాయి. అన్నీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి మాట్లాడుతూ.. ఈ వేడుకకు లోపలికి రాలేక ఇంకా చాలా మంది బయటే ఉన్నారు. వారందరికీ సారీ. ఇలా అమెరికాలో ఈవెంట్ చేయడం ఇదే మొదటి సారి. ఇది దిల్ రాజు గారి వల్లే సాధ్యమైంది. రామ్ చరణ్ గారు, శంకర్ గారు ఇలా అందరూ మన కోసం వచ్చారు. ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరారు.

Also Read-Allu Arjun Press Meet: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఏమన్నారంటే..


Game-Changer.jpg

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఓ తెలుగు సినిమా ఈవెంట్ డల్లాస్‌లో జరగడం ఇదే మొదటి సారి. రామ్ చరణ్ గారు ఇక్కడకు వచ్చారు. అది డల్లాస్ ఆడియెన్స్ మీద ఆయనకున్న అభిమానం, ప్రేమ. ఇక డల్లాస్‌లో ఈవెంట్లు జరుగుతుంటాయి. దానికి ఇదే ప్రారంభం, ఆరంభం. సుకుమార్ గారు మన అందరినీ గర్వపడేలా చేశారు. మళ్లీ రామ్ చరణ్ గారి సినిమాతో అందరినీ గర్వపడేలా చేయండి. శంకర్ గారి సినిమాలంటే మాకు ప్రాణం. శంకర్ గారు మా అందరికీ స్పూర్తి. ఈ గేమ్ చేంజర్ అందరికీ గేమ్ చేంజర్ మూమెంట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.


వెర్స‌టైల్ యాక్ట‌ర్ ఎస్‌.జె.సూర్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పేందుకు హైదరాబాద్‌కి మొదటి సారిగా వచ్చా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి. ఆర్‌సి ది కింగ్ అని నా ఫోన్‌లో సేవ్ చేసుకున్నాను. రామ్ చరణ్ రియల్ కింగ్. బిహేవియర్, డ్యాన్స్, స్టైల్, యాక్టింగ్ ఇలా అన్నింట్లో రామ్ చరణ్ కింగ్. గేమ్ చేంజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. హీరోయిన్ అంజలి మాట్లాడుతూ.. ఫస్ట్ టైమ్ ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డ‌ల్లాస్‌లో, అది కూడా ఇంత మంది తెలుగు అభిమానుల మ‌ధ్య‌లో జ‌రుగుతుండ‌టం ఎంతో ఆనందంగా ఉంది. గేమ్ చేంజర్ మూవీలో నేను చేసిన పాత్ర‌.. నా కెరీర్‌లో బెస్ట్ రోల్‌గా నిలిచిపోతుందని నేను గ‌ట్టిగా న‌మ్ముతున్నాను. అంత మంచి రోల్‌ను నాకు రాసిన శంక‌ర్‌గారికి థాంక్స్‌. దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. ఎస్‌వీసీని నా ఫ్యామిలీ ప్రొడ‌క్ష‌న్‌గా భావిస్తుంటాను. ‘సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, వ‌కీల్ సాబ్’ సినిమాలు చేశాను. ఇప్పుడు ‘గేమ్ చేంజ‌ర్‌’తో రాబోతున్నాను. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌ను చాలా కొత్త‌గా చూడ‌బోతున్నారు. అప్ప‌న్న క్యారెక్ట‌ర్‌ను అంద‌రూ బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు.

Also Read-అల్లు అర్జున్ కాలు విరిగిందా? చెయ్యి విరిగిందా?: సీఎం రేవంత్

Also Read-Sandhya Theatre Stampede: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 22 , 2024 | 07:41 PM