Game Changer: ‘గేమ్ చేంజర్’.. ఒక్కపాటకి పెట్టిన ఖర్చుతో మిడియం రేంజ్ హీరోతో సినిమా తీయవచ్చు

ABN , Publish Date - Dec 11 , 2024 | 10:51 AM

ఇప్ప‌టి వ‌ర‌కు ‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి విడుద‌లైన‌ ‘జ‌ర‌గండి జ‌ర‌గండి’... ‘రా మ‌చ్చా రా.. ’ పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన రాగా.. ఇప్పుడు విడుద‌లైన మూడో సాంగ్ ‘నా నా హైరానా’ ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ పాటకి అయిన ఖర్చుతో ఓ మీడియం రేంజ్ హీరోతో సినిమా తీసేయవచ్చంటే.. శంకర్ ఎంతగా తన పనితనాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు..

Game Changer Movie Stills

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌కు సిద్ధమవుతోన్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మేకర్స్ మూడు సాంగ్స్‌తో పాటు టీజ‌ర్‌ను విడుదల చేశారు. వీటితో ‘గేమ్ చేంజ‌ర్‌’పై ఉన్న అంచ‌నాలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా మూడో సాంగ్‌గా వచ్చిన ‘నా నా హైరానా..’ పాటను మేక‌ర్స్ రీసెంట్‌గా విడుద‌ల చేయ‌గా.. సోష‌ల్ మీడియాలో 47 మిలియ‌న్ వ్యూస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూ ఇంకా టాప్‌లో ట్రెండ్ అవుతూ ఉంది. అయితే ఈ పాట మేకింగ్‌కు సంబంధించి తాజాగా ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read-Google Search Trends 2024: వ్యక్తుల జాబితాలో టాప్ 5లో పవన్‌ కళ్యాణ్‌.. ‘యే పవన్ నహీ ఆంధీ హై’

శంక‌ర్ సినిమాలలో ఉండే భారీతనం తెలియంది కాదు. ‘గేమ్ చేంజర్’‌తో మ‌రోసారి పాట‌ల‌ను చిత్రీక‌రించ‌టంలో త‌న‌కు తానే సాటి అని ఆయన నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా ‘నా నా హైరానా’ పాట‌ను చూసిన వారంతా అంటున్న మాటలివే. ఈ పాటని న్యూజిలాండ్‌లో 6 రోజుల పాటు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో చిత్రీక‌రించారు. ఒక్కో స‌న్నివేశం ఒక్కో పెయింటింగ్‌లా విజువ‌ల్ బ్యూటీగా మ‌లిచారు శంక‌ర్‌. దీని కోసం ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డింది. హీరో రామ్ చ‌ర‌ణ్ అయితే న్యూజిలాండ్‌లోని ఆక్‌లాండ్ నుంచి పాట‌ను చిత్రీక‌రించిన క్రిస్ట్ చ‌ర్చ్ లొకేష‌న్‌కు హెలికాఫ్ట‌ర్‌లో వెళ్లారు. ఇక ఈ పాట చిత్రీక‌ర‌ణ‌కే రూ.10 కోట్లు ఖ‌ర్చు పెట్టారంటే మామూలు విష‌యం కాదు. ఈ బడ్జెట్‌తో మీడియం రేంజ్ హీరోతో ఒక సినిమా తీయవచ్చు కూడా. అలాగే సినిమాటోగ్రాఫ‌ర్ తిరు ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలో చిత్రీక‌రించిన తీరు అద్భుతమనే చెప్పాలి. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నుకునేంత గొప్ప‌గా పాట‌లోని ప్ర‌తీ ఫ్రేమ్ ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఈ పాట‌ను ఫ్యూజ‌న్ మెలోడీ (వెస్ట్ర‌న్‌, క‌ర్ణాటిక్ కాంబో)గా ట్యూన్ చేశారు. అలాగే బ‌ర్న్ట్ టోన్స్‌ను ఉప‌యోగించారు.. రెండు మోనో టోన్స్‌ను ఓ స్టీరియో సౌండ్‌గా మార్చి ఈ పాట‌లో ఉప‌యోగించ‌టం విశేషం. ఆలీమ్ హ‌కీం డిజైన్ చేసిన స్టైలిష్ లుక్‌, మ‌నీష్ మ‌ల్హోత్రా కాస్ట్యూమ్స్ గ్లోబ‌ల్ స్టార్‌ను ఓ స‌రికొత్త లుక్ క‌నిపించారు.

Also Read- Sandhya Theatre Tragedy: రేవతి మృతిలో మా ప్రమేయం లేదు.. థియేటర్ మాదే కానీ..


Ram-Charan.jpg

సారెగ‌మ మ్యూజిక్ పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నగేమ్ చేంజ‌ర్ సినిమాలోని ఈ పాట‌ను శ్రేయా ఘోష‌ల్, కార్తీక్ పాడారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీని అందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి విడుద‌లైన‌ ‘జ‌ర‌గండి జ‌ర‌గండి’... ‘రా మ‌చ్చా రా.. ’ పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన రాగా.. ఇప్పుడు విడుద‌లైన మూడో సాంగ్ ‘నా నా హైరానా’ ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. అలాగే ఈ పాటలో రామ్ చరణ్, కియారాల కెమిస్ట్రీలో కూడా పాటకి మరింత అందాన్ని తీసుకొచ్చింది. చ‌ర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య‌, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి, న‌వీన్ చంద్ర‌, సునీల్‌, శ్రీకాంత్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో నటిస్తున్నారు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ సినిమాను త‌మిళంలో ఎస్‌వీసీ, ఆదిత్య రామ్ మూవీస్ విడుద‌ల చేస్తుండ‌గా.. హిందీలో ఏఏ ఫిల్మ్స్ అనీల్ త‌డానీ విడుద‌ల చేస్తున్నారు. డిసెంబ‌ర్ 21న యు.ఎస్‌లోని డ‌ల్లాస్‌లో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ క‌ల్లెప‌ల్లి ఆధ్వ‌ర్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వ‌హించ‌నున్నారు.

Also Read-Manchu Family Dispute: తలకు గాయం.. హాస్పిటల్‌లో మోహన్ బాబు

Also Read-మనోజ్.. మీ అమ్మ హాస్పిటల్ పాలైందిరా: మోహన్ బాబు వాయిస్ మెసేజ్ వైరల్

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 11 , 2024 | 10:51 AM