Vettaiyan: రజినీ సినిమాపై కండక్టర్ కేస్

ABN , Publish Date - Oct 05 , 2024 | 06:21 PM

ఈ సినిమా ట్రైలర్ అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ పొందుతుంది. ఓ వైపు ఫ్యాన్స్ తమ 'తలైవా'ని గొప్పగా చుపించారంటూ దర్శకుడు జ్ఞానవేల్(Gnanavel), మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌(Anirudh)ని ఆకాశానికెత్తుతున్నారు. ఈ క్రమంలో సినిమాపై, డైరెక్టర్‌పై కొన్ని విమర్శలు వినిపిస్థున్నాయి. తాజాగా తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(TSSTC)కి చెందిన రిటైర్డ్ బస్ కండక్టర్ ఈ సినిమాపై కోర్టు‌లో ఓ కేస్ వేశాడు. ఇంతకీ ఆ కేసేంటి అంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) లేటెస్ట్ ఫిల్మ్ 'వేట్టయన్'(Vettaiyan) విడుదలకు సిద్దమవుతుంది ఇటీవల రిలీజైనా ఈ సినిమా ట్రైలర్ అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ పొందుతుంది. ఓ వైపు ఫ్యాన్స్ తమ 'తలైవా'ని గొప్పగా చుపించారంటూ దర్శకుడు జ్ఞానవేల్(Gnanavel), మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌(Anirudh)ని ఆకాశానికెత్తుతున్నారు. ఈ క్రమంలో సినిమాపై, డైరెక్టర్‌పై కొన్ని విమర్శలు వినిపిస్థున్నాయి. తాజాగా తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(TSSTC)కి చెందిన రిటైర్డ్ బస్ కండక్టర్ ఈ సినిమాపై కోర్టు‌లో ఓ కేస్ వేశాడు. ఇంతకీ ఆ కేసేంటి అంటే..


ఈ సినిమా ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్‌లు పోలీసులు చేసే చట్టవిరుద్ధమైన హత్యలను తరచుగా 'ఎన్‌కౌంటర్లు'గా గ్లోరిఫై చేస్తున్నారంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL)ని మద్రాస్ కోర్ట్‌లో దాఖలు చేశారు. సదరు వ్యక్తి ఒక వివరణాత్మక పిటిషన్‌లో ఇటువంటి సినిమాలు విస్మరించే రాజ్యాంగ మరియు న్యాయపరమైన వైఫల్యాలను ఎత్తిచూపారు. దీనిపై కోర్ట్ కూడా అనుకూలంగానే స్పందించినట్లు సమాచారం.


అయితే 2021లో విడుదలైన సూర్య మూవీ 'జై భీమ్' (Jai Bhim) చిత్రంతో డైరెక్టర్ జ్ఞాన‌వేల్(Gnanavel) కమర్షియల్‌గా హిట్ కొట్టడంతో పాటు విమర్శకుల నుండి ప్రశంసలు పొందాడు. అయితే జై భీమ్ చిత్రం ద్వారా పోలీసుల కస్టడీ వైయలెన్స్‌ని అంతగా చూపించి ఇందులో మాత్రం "ఎన్కౌంటర్ స్పెషలిస్ట్" గా రజనీకాంత్‌ని గ్లోరిఫై చేయడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే 'ఒకట్రెండు సినిమాలు చూసి నటుల్ని, దర్శకుల్నీ నెత్తిన పెట్టుకోవద్దు. కోర్ వ్యాల్యూస్ ఏమిటి, ప్రాపంచిక దృక్పథం ఏమిటి అనేది చూడాలి, ఎవరిలోనైనా' అంటూ జ్ఞాన‌వేల్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. మరొకరు పోలీసుల్ని ధర్మ రక్షణ, దుష్ట శిక్షణ చేసేవాళ్ళుగా చూపించే కామెడీకి ఇక అంతుండదు కాబోలు మన సినిమాల్లో అంటూ ఫైర్ అయ్యారు. కాగా మరోవైపు సినిమాలో చూపించిన అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) క్యారెక్టర్‌కి మాత్రం పాజిటివ్ మార్క్స్ పడుతున్నాయి.

Also Read- Rajendra Prasad: పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యం రాజేంద్రుడికి ఆ దేవుడు ఇవ్వాలి


Also Read- Pawan Kalyan: అప్పుడు తిట్టినా కేసు లేదు.. ఇప్పుడు ఒక్కమాటకే పోలీసు కేసు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 05 , 2024 | 06:23 PM