Rajinikanth: గుకేష్‌‌కి రజినీ ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూశారా..

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:38 PM

Rajinikanth: ప్రపంచ చెస్ ఛాంపియన్, తెలుగు తేజం గుకేష్‌ దొమ్మరాజు తన తల్లితండ్రులతో పాటు తలైవా ఇంటికి వెళ్లారు. రజినీ ఏం చేశారు, శివ కార్తికేయన్ ఏం ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చారంటే..

Gukesh mets rajinikanth

ప్రపంచ చెస్ ఛాంపియన్, తెలుగు తేజం గుకేష్‌ దొమ్మరాజు నేడు చెన్నైలో సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిశారు. ఆయనతో పాటు అమరన్ హీరో శివ కార్తికేయన్ కూడా కలిశారు. రజినీ ఏం చేశారు, శివ కార్తికేయన్ ఏం ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చారంటే..


ప్రపంచ చెస్‌ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్‌ కు సినీ, రాజకీయ ప్రముఖుల నుండి ప్రశంసల జల్లు కురుస్తోంది. సింగపూర్‌లో జరిగిన వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్ ఫైనల్లో 18 ఏళ్ల గుకేష్‌ 7.5-6.5 స్కోరుతో గత విజేత డింగ్‌ లిరెన్‌ (చైనా)ను ఓడించి టైటిల్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. తద్వారా అతి పిన్నవయస్సులో విశ్వ విజేతగా నిలిచిన రికార్డును తెలుగు తేజం అందుకున్నాడు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆహ్వానం మేరకు ఆయన చెన్నైలోని నివాసంలో కలిశారు.

csjgfyj.jpg


ఈ క్రమంలో గుకేష్ తన తల్లితండ్రులతో పాటు తలైవా ఇంటికి వెళ్లారు. రజినీ శాలువాతో ప్రపంచ ఛాంపియన్ ని సన్మానించారు. అలాగే పరమహంస యోగానందకు సంబంధించిన 1946 ఆధ్యాత్మిక క్లాసిక్ ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ పుస్తకాన్ని బహుమతిగా అందించారు. ఈ సన్నివేశాలను గుకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తన కోసం విలువైన సమయాన్ని వెచ్చించినందుకు సూపర్ స్టార్ కి గుకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ఇక అమరన్ సినిమా హీరో ప్రిన్స్ శివకార్తికేయన్ కూడా గుకేష్ ని కలిసి ఓ ఎక్స్పెన్సివ్ వాచ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు.

గుకేష్ చేతిలోని ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ వివరాల కోసం Click Here

Updated Date - Dec 27 , 2024 | 08:01 PM