దసరాకి వస్తున్న రాజావారు
ABN , Publish Date - Aug 21 , 2024 | 01:30 AM
‘మ్యాడ్’, ‘ఆయ్’ వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ హిట్‌తో దూసుకుపోతున్న నార్నే నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’.
‘మ్యాడ్’, ‘ఆయ్’ వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ హిట్‌తో దూసుకుపోతున్న నార్నే నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. సంపద హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సతీశ్ వేగేశ్న దర్శకుడు. చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌కు నచ్చి, ఎంపిక చేసిన కథతో మా సినిమా రూపుదిద్దుకుంది. ఆయన అంచనాల మేరకు దర్శకుడు సతీశ్ ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని రూపొందించారు. భారీ తారాగణంతో పూర్తి కమర్షియల్ ఫార్మెట్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తున్నాం. ఇది నార్నే నితిన్‌కు హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుంది’ అని చెప్పారు.