Raja Markandeya: ‘రాజా మార్కండేయ’ టైటిల్ లోగో విడుదల

ABN , Publish Date - Aug 25 , 2024 | 06:07 PM

బన్నీ అశ్వంత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ సామా - వెంకట్ గౌడ్ పంజాల సంయుక్తంగా ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్న చిత్ర టైటిల్ ప్రకటన మరియు లోగో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. ‘రాజా మార్కండేయ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి ‘వేట మొదలైంది’ అనేది ట్యాగ్‌లైన్.

Raja Markandeya Movie Title Logo Launch Event

బన్నీ అశ్వంత్‌ (Bunny Ashwanth)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ (Sri Jaganmatha Renuka Creations) పతాకంపై శ్రీధర్ సామా - వెంకట్ గౌడ్ పంజాల సంయుక్తంగా ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్న చిత్ర టైటిల్ ప్రకటన మరియు లోగో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. ‘రాజా మార్కండేయ’ (Raja Markandeya) అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి ‘వేట మొదలైంది’ అనేది ట్యాగ్‌లైన్. తేజస్ వీరమాచినేని (Tejas Veeramachineni), అక్షయ రోమి (Akshaya Romi) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గౌరిశెట్టి - బన్నీ అశ్వంత్ సహ నిర్మాతలు. సీనియర్ నటుడు సుమన్ ముఖ్య అతిధిగా.. నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణలతో పాటు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గంగపురం పద్మగౌడ్, నవీన్ మాచర్ల విశిష్ట అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


suman-Movie-Opening.jpg

కంటెంట్ బాగుంటే.. చిన్న చిత్రాలు కూడా పెద్ద చిత్రాలకు పోటీగా కోట్లు కొల్లగొడుతున్నాయని, ‘రాజా మార్కండేయ’ చిత్రం కూడా ఆ చిత్రాల కోవలో చేరాలని సుమన్ ఆకాంక్షించారు. సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయిందని చెప్పిన దర్శకనిర్మాతలు.. ఈ చిత్ర రూపకల్పనలో సహాయసహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కిస్తున్న ‘రాజా మార్కండేయ’ చిత్రం సంచలన విజయం సాధించి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని అతిధులంతా అభిలషించారు. నాగేష్, లయన్ సామ శ్రీధర్ గుప్తా, సామ ప్రశాంతి, సర్దార్ పంజాల వెంకట్ గౌడ్, గౌరిశెట్టి శ్రీనివాస్ గుప్తా, వంగపల్లి అంజయ్య స్వామి, వడ్డె మహేశ్వరి, పేరం నవీన్ కుమార్, రాధ, గ్రంధం శ్రీనివాస్ నాయుడు, సూర్యతేజ, సామ నరేష్, సూర్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను కూడా బన్నీ అశ్వంత్ నిర్వహిస్తున్నారు. (Raja Markandeya Movie Title Logo Launch Event)

Updated Date - Aug 25 , 2024 | 06:07 PM