Ram Bhajarang: ‘రామ్ భజరంగ్’ ఫస్ట్ లుక్ వదిలారు..

ABN , Publish Date - Oct 10 , 2024 | 04:56 PM

సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత స్వాతిసుధీర్ నిర్మిస్తున్న సినిమా ‘రామ్ భజరంగ్’. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న ‘రామ్ భజరంగ్’ సినిమాకు సి.హెచ్. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దసరా కానుకగా విడుదల చేశారు.

Ram Bhajarang Movie Still

సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్ (Sun Rise Entertainment) బ్యానర్‌పై నిర్మాత స్వాతిసుధీర్ (Swathi Sudheer) నిర్మిస్తున్న సినిమా ‘రామ్ భజరంగ్’. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న ‘రామ్ భజరంగ్’ సినిమాకు సి.హెచ్. సుధీర్ రాజు (CH Sudheer Raju) దర్శకత్వం వహిస్తున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. దసరా సందర్భంగా ‘రామ్ భజరంగ్’ (Ram Bhajarang) ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగానూ, చాలా మాసీగానూ ఉంది. ఈ పోస్టర్‌లో ఇద్దరు హీరోలు రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ డిఫరెంట్ లుక్స్, గెటప్స్‌లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా రాజ్ తరుణ్‌ని ఇంత వరకు ఇలా చూడలేదు. ఫస్ట్ టైమ్ ఓ వినూత్న గెటప్‌లో ఆయన దర్శనమిస్తున్నారు. ఇద్దరూ హీరోలు కూడా ఈ పోస్టర్‌లో మాస్ లుక్‌లో దర్శనమిస్తూ.. ఇది ఏదో తరహా చిత్రమో తెలియజేస్తున్నారు. (Ram Bhajarang First Look Out)


Ram-Bhajarang.jpg

‘గదర్ 2’ హీరోయిన్ సిమ్రత్ కౌర్, ‘బిచ్చగాడు’ ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉంటాయని, 2025‌లో ఐదు భాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా నిర్మాత స్వాతిసుధీర్ తెలిపారు. ఈ మధ్య రాజ్ తరుణ్ నటించిన వరుస చిత్రాలు థియేటర్లలో విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడాయన ఖాతాలో మరో చిత్రం యాడ్ అయింది.

Also Read- Prabhas: ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. ఎప్పుడంటే

Also Read- Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో స్మోక్‌ చేస్తూ దొరికిన విష్ణుప్రియ‌.. వైర‌ల్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 10 , 2024 | 04:56 PM