విడిపోనున్న రెహమాన్ దంపతులు
ABN , Publish Date - Nov 20 , 2024 | 03:51 AM
ప్రముఖ సంగీత దర్శకుడు, అస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ దంపతులు త్వరలో విడిపోనున్నారు. ఈ మేరకు రెహమాన్ సతీమణి సైరా తరపు న్యాయవాది వందనా షా మంగళవారం రాత్రి వెల్లడించారు...
ప్రముఖ సంగీత దర్శకుడు, అస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ దంపతులు త్వరలో విడిపోనున్నారు. ఈ మేరకు రెహమాన్ సతీమణి సైరా తరపు న్యాయవాది వందనా షా మంగళవారం రాత్రి వెల్లడించారు.. ‘పెళ్ళయిన చాలా సంవత్సరాల తర్వాత సైరా తన భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తీవ్రమైన భావోద్వేగ ఒత్తిడి తర్వాత తీసుకున్న నిర్ణయమిది. ఇరువురి మధ్య గాఢమైన ప్రేమ, అన్యోన్యత ఉన్నప్పటికీ వారి వివాహ బంధంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి అధిగమించలేనివని తేలడంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు’ అని లాయర్ వందన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, 1995లో ఈ దంపతులకు వివాహం కాగా, వీరికి ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కష్టకాలంలో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని రెహమాన్ కుమారుడు ఏఆర్ఆర్ అమీన్ మీడియాకు విఙ్ఞప్తి చేశారు. సైరా భాను కుటుంబీకులు గుజరాత్ నుంచి చెన్నైకు వచ్చి స్థిరపడ్డారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)